AP Rains: ఏపీ ప్రజలకు అలెర్ట్.. మరో అల్పపీడనం హెచ్చరిక.. వెదర్ రిపోర్ట్ ఇదిగో..

|

Nov 24, 2022 | 8:39 AM

కొద్దిరోజుల క్రితం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడి ప్రస్తుతం దక్షిణ కోస్తాంద్రపై అల్పపీడనంగా కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

AP Rains: ఏపీ ప్రజలకు అలెర్ట్.. మరో అల్పపీడనం హెచ్చరిక.. వెదర్ రిపోర్ట్ ఇదిగో..
AP Weather Report
Follow us on

ఏపీ ప్రజలకు మరో అలెర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. కొద్దిరోజుల క్రితం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడి ప్రస్తుతం దక్షిణ కోస్తాంద్రపై అల్పపీడనంగా కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది గురువారం నాటికి మరింత బలహీనపడినట్లు తన నివేదికలో పేర్కొంది. అలాగే ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో నైరుతి వైపు వంగి ఉంది. దీని ప్రభావంతో రాబోయే రెండు రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఈ నెలాఖరులోగా ఉత్తర అండమాన్ సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడి బలపడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.