AP News: ట్రైన్ ఏసీ భోగీలో చెక్ చేస్తూ.. ఓ బెర్త్‌ కింద కనిపించింది చూడగా

|

Dec 24, 2024 | 3:17 PM

వారిద్దరూ మహబూబ్ నగర్ నుంచి తిరుపతి వెళ్తున్నారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ఓ బెర్త్ వచ్చింది. తిరుమల చేరుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక తిరుగు ప్రయాణంలో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లోనే వచ్చారు. ఈసారి టూ టైర్ ఏసీ కోచ్‌‌లో బెర్త్ వచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది. ఇంటికి చేరుకోగానే..

AP News: ట్రైన్ ఏసీ భోగీలో చెక్ చేస్తూ.. ఓ బెర్త్‌ కింద కనిపించింది చూడగా
Representative Image
Follow us on

అప్పుడప్పుడూ మనం ప్రయాణాలు చేస్తున్న సమయంలో ఏదొకటి పొరపాటున పోగొట్టుకుంటూ ఉంటాం. సరిగ్గా ఈ మహిళ కూడా అలాగే పొరపాటున రైలులో బంగారాన్ని పోగొట్టుకుంది. నార్మల్ వస్తువు అయితే పోనీలే.. పోయింది.. ఇక దొరకుదులే అని అనుకుంటాం. బంగారం కదా.! కొంచెం బాధ వేసినా.. దొరకదు అని అనుకోవాల్సిందే. అయితే ఇంతలో వారికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. మీ బంగారం సేఫ్‌గా ఉంది.. వచ్చి తీసుకెళ్లండని అవతల వ్యక్తి అన్నారు. అంతే.! సదరు మహిళ ఆనందానికి అవధులు లేవు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే..

ఇది చదవండి: టిక్.. టాక్.. టిక్..! ఈ ఫోటోలో దాగున్న నెంబర్లు గుర్తిస్తే.. మీవి డేగ కళ్లే

వివరాల్లోకి వెళ్తే.. కడపకు చెందిన రజిత అనే మహిళ రైల్వేలో టీటీఈగా విధులు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఆమె తిరుపతిలో పని చేస్తుండగా.. ఆదివారం సదరు మహిళకు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో డ్యూటీ పడింది. ఈ క్రమంలోనే ఆమె రైలులోని టూటైర్ ఏసీ భోగిని చెక్ చేస్తుండగా.. ఓ బెర్త్ కింద బంగారు బ్రాస్‌లెట్ కనిపించింది. వెంటనే దానిని తీసుకుని.. చిత్తూరు రైల్వే పోలీసులకు అందజేసింది. ఏ కోచ్.? ఏ బెర్త్.? కింద తనకు ఈ బ్రాస్‌లెట్ దొరికిందన్న వివరాలను తెలియజేసింది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌

ఈ మేరకు ఖాకీలు టికెట్ రిజర్వేషన్ల ఆధారంగా ఈ బ్రాస్‌లెట్ పోగొట్టుకున్నది మహబూబ్‌నగర్‌కు చెందిన లతగా గుర్తించారు. వారికి వెంటనే సమాచారాన్ని అందించారు. సదరు మహిళ చిత్తూరు రైల్వేస్టేషన్‌కు వెళ్లి తన బ్రాస్‌లెట్ తిరిగి తెచ్చుకుంది. కాగా, తాము వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో తిరుమల దర్శనానికి వచ్చామని.. తిరిగి వచ్చేటప్పుడు రైలులో ఈ బ్రాస్‌లెట్ పోగొట్టుకున్నామని లత తెలిపింది. రూ. 2 లక్షలు విలువ చేసే బ్రాస్‌లెట్ పోవడంతో చాలా కంగారుపడ్డామని చెప్పింది. తమ బ్రాస్‌లెట్ తిరిగి దక్కడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొంటూ.. టీటీఈ రజితకు ధన్యవాదాలు తెలిపింది.

ఇది చదవండి: ఇదేం లొల్లిరా.. శోభనం రాత్రి వధువు వింత కోరికలు.. దెబ్బకు బిత్తరపోయిన వరుడు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..