KA Paul-Pawan: పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడిన రాఘవులు.. పవన్ గెలవడు.. ఫ్యాన్స్ తనతో వచ్చేయమని పాల్ పిలుపు..

రాఘవులు, నారాయణ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నిరసన సభలో పవన్‌పై విరుచుకుపడ్డారు. ఆటలో అరటిపండులా అప్పటికే అక్కడున్న కేఎ పాల్‌ కూడా తనదైన స్టైల్లో రియాక్టయ్యారు. తాజాగా కాక రేపుతున్నాయి కామ్రెడ్ల కామెంట్స్.. అంతేకాదు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ధర్నాలో పవన్‌పై విరుచుకుపడ్డారు. 

కామ్రెడ్లకు మూడొచ్చింది.. ఇన్నాళ్లూ అస్సలు పత్తాలేని రాఘవులు, నారాయణ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నిరసన సభలో పవన్‌పై విరుచుకుపడ్డారు. ఆటలో అరటిపండులా అప్పటికే అక్కడున్న కేఎ పాల్‌ కూడా తనదైన స్టైల్లో రియాక్టయ్యారు. తాజాగా కాక రేపుతున్నాయి కామ్రెడ్ల కామెంట్స్.. అంతేకాదు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ధర్నాలో పవన్‌పై విరుచుకుపడ్డారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరంకాకుండా రోజుల తరబడి నిరసన తెలుపుతున్న వారికి కామ్రెడ్లు రాఘవులు, నారాయణ భరోసా ఇచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. చేగువేర టీషర్టులు వేసుకోవడం కాదు ఆయన స్ఫూర్తి పొందాలంటూ రాఘవులు చురకలు వేశారు. పవన్‌పై కామ్రెడ్లు ఎంతగా విసుక్కున్నారంటే..మాటల్లో చెప్పలేం.

ఇక సుడిగాలిలా..సంబంధం లేకుండా వచ్చినట్లు.. కేఏ పాల్‌ ప్రత్యక్ష్యమయ్యారు. తమ్ముడు సినిమాల్లో బిజీ.. అందుకే నేనే రోడ్‌ మ్యాప్‌ చేయిస్తానంటూ మధ్యలో పాల్‌ దూరాడు..ఆటలో అరటిపండులా పవన్‌పై కొన్ని రాళ్లేశారు. తమ్ముడు పవన్ సినిమాల్లో బిజీ. పవన్ కళ్యాణ్ బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నారు. మా దగ్గర ఆల్రెడీ రోడ్ మ్యాప్ ఉంది తనతో వచ్చేయ్యమని పవన్ కి పిలుపునిచ్చారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా తన ఫాన్స్ అయిపోవాలంటూ పాల్‌ కామెంట్‌ చేశారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ ఎలాగూ గెలవలేడు..  తనతో వచ్చి పోరాటం చేయాలని పిలుపునిచ్చాడు పాల్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..