R Narayana Murthy: థియేటర్స్‌ను మూసివేయకండి.. సీఎం జగన్‌ను కలవమని సూచిస్తున్న ఆర్ నారాయణ మూర్తి..

R Narayana Murthy: ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్స్  విషయంలో ప్రభుత్వం వెర్సస్.. థియేటర్స్ అన్నట్లు వార్ జరుగుతోంది. మూవీ టికెట్స్ ధరలను ప్రభుత్వం నిర్ణయించడమే కాదు.. బెనిఫిట్ షో లను..

R Narayana Murthy: థియేటర్స్‌ను మూసివేయకండి.. సీఎం జగన్‌ను కలవమని సూచిస్తున్న ఆర్ నారాయణ మూర్తి..
R Narayana Murthy

Edited By:

Updated on: Dec 27, 2021 | 6:56 PM

R Narayana Murthy: ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్స్  విషయంలో ప్రభుత్వం వెర్సస్.. థియేటర్స్ అన్నట్లు వార్ జరుగుతోంది. మూవీ టికెట్స్ ధరలను ప్రభుత్వం నిర్ణయించడమే కాదు.. బెనిఫిట్ షో లను కూడా ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఓ వైపు కరోనా వైరస్ సృష్టించిన కల్లోలం నుంచి తేరుకోవడమే కష్టమని భావిస్తున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం సినిమా థియేటర్స్ టికెట్స్ విషయంలో తీసుకున్న నిర్ణయం థియేటర్స్ యాజమాన్యానికి పెద్ద దెబ్బ అని టాక్.. ఇక ఓ వైపు సినిమా రిలీజైన థియేటర్స్ లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ.. నిబంధనలు పాటించడం లేదంటూ.. సీజ్ చేస్తున్నారు.. మరోవైపు ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ ధరకు సినిమాను ప్రదర్శించడం కష్టమంటూ స్వచ్చందంగా థియేటర్స్ ను యజమానులు మూసివేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాని హీరోగా నటిస్తున్న శ్యామ్ సింగ్ రాయ్ సినిమా ప్రెస్ మీట్ లో పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఉత్తరాంధ్రలో కొన్ని థియేటర్ లు మూసేసారు అన్న వార్త బాధాకరమని ఆర్ నారాయణ మూర్తి చెప్పారు. తెలుగు ఫిల్మ్ పెద్దలందరికీ ఆర్ నారాయణ మూర్తి థియేటర్ లు మూయకండని అంటూ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే లను ఎంపీలను థియేటర్స్ యజమానులు కలవమని సూచించారు. అంతేకాదు జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేయండి.. మళ్లీ థియేటర్స్ ఓపెన్ చేయండని చెప్పారు. అంతేకాదు సినిమా తీసే వారు.. చూపించే వారు.. చూసే వారు బాగుంటేనే మొత్తం ఇండస్ట్రీ బాగుంటుందని ఆర్ నారాయణ మూర్తి చెప్పారు.

Also Read: పసికందుల్ని రోడ్డు మీద వదిలేసిన నగరాల్లో టాప్‌ప్లేస్‌‌లో దేశరాజధాని.. షాకింగ్ విషయాలు