
దాదాపుగా మత్స్యకారుల జీవితం చేపల వేటపైనే ఆధారపడి ఉంటుంది. ఓసారి వలకు చేపలు చిక్కాయంటే.. వారికి ఆ వారం కడుపు నిండినట్టే. అలా కాదని దొరక్కపోతే.. వారం అయినా చేపలు వలకు చిక్కేదాకా ఇంటికి చేరుకోరు. అయితే ఇక్కడ ఓ జాలరి చేపల కోసం వల వేయగా.. అతడికి దిమ్మతిరిగే షాక్ తగిలింది. వల బరువెక్కిందని పైకి లాగి చూడగా.. దెబ్బకు మైండ్ బ్లాంక్ అయింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..!
గుంటూరు జిల్లా తాడేపల్లి కృష్ణా కెనాల్ బకింగ్ హామ్ కెనాల్ వంతెన వద్ద చేపల వేట కోసం వల వేసిన మత్స్యకారుడికి గుండె గుభేల్ అయింది. చేపల కోసం వేసిన వల బరువెక్కిందని పైకి లాగి చూడగా అదిరిపడ్డాడు. బరువుగా ఉన్న వలను చూసి పెద్దమొత్తంలో చేపలు పడ్డాయని పైకి లాగాడు. తీరా చూస్తే వలలో భారీ కొండచిలువ పడింది. దీంతో దెబ్బకు కంగుతిన్నాడు. ఇక స్థానికంగా ఉన్న కొంతమంది మత్యకారులు అక్కడికి చేరుకొని వలను బయటకు లాగి కొండచిలువను అతి కష్టం తీశారు. దాన్ని చంపకుండా దగ్గరలోని కొండ ప్రాంతంలో విడిచిపెట్టారు.