Pulasa: 9 రోజుల తర్వాత చిక్కిన మరో పులస.. వేలంలో ఎంత పలికిందో తెల్సా..?

వర్షాకాలం వచ్చి.. గోదావరికి ఎర్ర నీరు రావడం మొదలైంది అంటే ఆ జిల్లాల్లో మత్స్యకారుల ఆనందం అంతా ఇంతా కాదు. ఎందుకంటే.. వారికి కాసుల పంట పడించే పులసలు చిక్కేది ఈ సీజన్‌లోనే. అయితే ఈ సారి అవి దొరకడమే గగనమైపోయింది. దీంతో దొరికే అరా కొరా పులస చేపలు సైతం భారీ రేటుకు అమ్ముడవుతున్నాయి.

Pulasa: 9 రోజుల తర్వాత చిక్కిన మరో పులస.. వేలంలో ఎంత పలికిందో తెల్సా..?
Pulasa Fish

Updated on: Jul 30, 2025 | 4:51 PM

గోదావరికి పులసల రాక ప్రారంభమైంది. దీంతో మత్స్యకారులు వాటిని పట్టేందుకు తెగ ఆరాటపడుతున్నారు. అయితే లభ్యత అంతంత మాత్రంగానే ఉంది. ఇటీవల కోస్తే కేవలం రెండు ముక్కలయ్యే పులసలు 4, 5 దొరికాయి. అవి కూడా వేలం పాటలో దాదాపు రూ 2000 నుంచి రూ 2500 వలకు పలికాయంటే.. పులసలకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. గోదావరి నీటిలో ఎదిరీదే పులసలకు మాత్రమే ఇంత డిమాండ్ ఉంటుంది. లాస్ట్ టైం అంటే 9 రోజుల క్రితం దొరికిన పులస రూ 22,000 వేలకు అమ్ముడయింది. తాజాగా మరో పులస చిక్కింది. దీన్ని యానాం మార్కెట్లో వేలం వేయగా.. రూ 17,000 వేలకు అమ్ముడయింది. ఈ పులస బరువు కేవలం కిలో నుంచి కిలోన్నరే!. కానీ ధర చూశారా..!

పుస్తెలమ్మైనా పులస తినాలని అనేది సామెత. దాని టేస్ట్ అద్భుతంగా ఉంటుందని.. అసలు వర్షించలేం అంటారు చేప ప్రియులు.  అందుకే పులసల సీజన్‌లో వాటిని దక్కించుకునేందుకు చాలామంది పోటీ పడతారు.  ఈసారి అయితే ఏకంగా జాలర్లకు ముందుగానే అడ్వాన్స్‌లు ఇచ్చి.. పులస చిక్కితే తమకే ఇవ్వాలని కోరుతున్నారు.  ఈ సారి గోదావరికి ఎర్రనీరు వచ్చినా పులసలు మాత్రం అరుదుగానే చిక్కుతున్నాయని జాలర్లు చెబుతున్నారు. ఆగస్టు నెలలో అయినా గంగమ్మ తమను కరుణించాలని వేడుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.