Jalli Kattu: చిత్తూరులో రక్తసిక్తమైన జల్లికట్టు.. సందట్లో సడేమియాలో పగలు తీర్చుకున్న పలువురు..!

|

Jan 02, 2022 | 8:36 PM

Jalli Kattu: చిత్తూరు జిల్లాలో నిర్వహించిన జల్లికట్టు రక్తసిక్తమైంది. చంద్రగిరి మండలం శానంబట్లలో ఇవాళ జరిగిన జల్లికట్టులో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న

Jalli Kattu: చిత్తూరులో రక్తసిక్తమైన జల్లికట్టు.. సందట్లో సడేమియాలో పగలు తీర్చుకున్న పలువురు..!
Follow us on

Jalli Kattu: చిత్తూరు జిల్లాలో నిర్వహించిన జల్లికట్టు రక్తసిక్తమైంది. చంద్రగిరి మండలం శానంబట్లలో ఇవాళ జరిగిన జల్లికట్టులో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకెళితే.. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శానంబట్ల గ్రామంలో జల్లి కట్టు నిర్వహించారు. యువకుల కేరింతలు, వేలాది మంది జనం మధ్య జల్లి కట్టు జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా.. కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి కూడా జల్లికట్టును చూసేందుకు జనం పెద్ద ఎత్తున వచ్చారు. పరిగెత్తే పశువులను లొంగదీసుకునేందుకు యువకులు ప్రయత్నించారు. అయితే, ఈ ప్రయత్నంలో పలువురు యువకులు తీవ్ర గాయాలకు గురయ్యారు. పశువులు కుమ్మేయడంతో కింద పడిపోయి10 మందికి పైగా తలలు పగిలిపోవడం, ఎద్దుల కొమ్మలు కుచ్చుకుని ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడంతో ఆసుపత్రిలో చేరారు. మరికొంతమంది కింద పడిపోవడంతో వారిని తొక్కుకుంటూ పశువులు వెళ్లాయి. ఇదిలాఉంటే.. పశువులను లొంగదీసుకునే ప్రయత్నంలో పోటీ పడ్డ యువకుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. కర్రలతో ఒకరిపై ఒకరు దాడికి కూడా పాల్పడ్డారు. జల్లికట్టు జరిగే ప్రాంతంలో పోలీసులు ఉన్నా ప్రేక్షక పాత్ర పోషించడంతో యువకులు రెచ్చిపోయారు. యువకులు తమ మధ్య ఉన్న పాత కక్షలు తీర్చుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘర్షణలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఆంక్షలు ఉన్నా యదేచ్చగా జల్లికట్టు నిర్వహించడం, పక్కనే పోలీసులు ఉన్నా పట్టించుకోకపోవడం తీవ్ర చర్చకు దారి తీసింది.

Also read:

Telangana Omicron: తెలంగాణలో విజృంభిస్తున్న ఒమిక్రాన్‌.. పెరుగుతున్న కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..

Omicron: హోమ్‌ టెస్ట్‌ ద్వారా ఒమిక్రాన్‌ని గుర్తించవచ్చా..! నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

Tea: చాయ్‌లో పాలు ఎందుకు కలుపుతారో తెలుసా.. దీని వెనుక ఓ పెద్ద సైన్స్ ఉంది.. అదేంటో తెలుసా..