నిషేధిత ట్రమడాల్ టాబ్లెట్లను సుడాన్‌కు ఎగుమతి చేస్తున్న తెలుగు వ్యక్తిని ముంబయిలోని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. అయితే ఈ టాబ్లెట్లు గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన సేఫ్ ఫార్మా అనే కంపెనీ నుంచి తయారైనట్లు గుర్తించారు. దాదాపు పది లక్షల టాబ్లెట్ల సరకును సీజ్ చేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ సేఫ్ ఫార్మా కంపెనీని ప్రారంభించారు. ఆ తర్వాత యాజమాన్యం మారిపోయింది.
ఐసీస్ తీవ్రవాదులు అలసట లేకుండా ఉండేందుకు ఈ టాబ్లెట్లను వినియోగిస్తారు. మాదక ద్రవ్యాల చట్టం ప్రకారం ఈ మాత్రల తయారీ, వినియోగంపై కేంద్రం ఆంక్షలు విధించింది. అయితే కాల్షియం టాబ్లెట్ల పేరుతో సేఫ్ ఫార్మా కంపెనీ వీటిని ఎగుమతి చేస్తూ పట్టుబడింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..