Love Story: ప్రియురాలి జ్ఞాపకాలతో హోటల్‌కు వెళ్లిన యువకుడు.. ఆ తరువాత ఏం చేశాడంటే..

|

Sep 23, 2021 | 8:23 AM

Sad Love Story: వాళ్లిద్దరూ ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. కడదాకా కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పి పెళ్లికి ఒప్పొంచారు.

Love Story: ప్రియురాలి జ్ఞాపకాలతో హోటల్‌కు వెళ్లిన యువకుడు.. ఆ తరువాత ఏం చేశాడంటే..
Sad Love Story
Follow us on

Sad Love Story: వాళ్లిద్దరూ ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. కడదాకా కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పి పెళ్లికి ఒప్పొంచారు. ఈ క్రమంలో వారికి త్వరలోనే పెళ్లి చేసేందుకు పెద్దలు కూడా సిద్ధమయ్యారు. కానీ కాలం వారి ప్రేమను చూసి అసూయ పెంచుకున్నట్లుంది. వారి జీవితాలకు ఎండ్ కార్డ్ వేసింది. తొలుత అనారోగ్యంతో ప్రియురాలు చనిపోగా.. ఆ తరువాత తన ప్రియురాలి లేని లోకంలో తాను ఉండలేనంటూ ప్రియుడు సైతం ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలాడు. ఈ విషాదంతమైన ప్రేమ కథకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని మైలవరం మండలం కరమలవారి పల్లెకు చెందిన రాచంరెడ్డి లక్ష్మినారాయణ రెడ్డి, పార్వతీ దంపతులకు కుమారుడు మురళీధర్ రెడ్డి(27), ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే, కొన్నేళ్ల క్రితం లక్ష్మీనారాయణ రెడ్డి చనిపోయాడు. మురళి సీఏ చదివాడు. ఆ సమయంలో తెలంగాణలోని ఖమ్మం పట్టణానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఇద్దరూ ఒకరికొరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పి.. పెళ్లికి ఒప్పించారు. పెద్దలు కూడా పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే, తాజాగా ఖమ్మం నుంచి ప్రేయసి కుటుంబ సభ్యులు వస్తున్నారని, పెళ్లికి సంబంధించి వివరాలు మాట్లాడుతారంటూ మురళీ తన ఇంట్లో వారం రోజులుగా చెబుతూ వచ్చాడు. వారు ఖమ్మం నుంచి నేరుగా ప్రొద్దుటూరుకు చేరుకుంటారని, అక్కడ లాడ్జీలో బస ఏర్పాటు చేశానని చెప్పాడు. అక్కడి నుంచి వారిని తీసుకువస్తానని చెప్పి.. మురళీ ఇంటి నుంచి హోటల్‌కు వెళ్లాడు. అయితే, హోటల్‌కు వెళ్లే ముందు సూసైడ్ లెటర్ రాసి వెళ్లాడు. అది చూసిన కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. అప్పటి వరకు అంతా సవ్యంగా సాగుతుందనుకున్న మురళీ కుటుంబ సభ్యులు.. ఆ లేఖను చూసి షాక్ అయ్యారు.

ఆ లేఖలో ఏముందంటే..
‘‘అమ్మా నన్ను క్షమించండి. నేను ప్రేమించిన యువతి ఈ నెల 20వ తేదీన అనారోగ్యంతో చనిపోయింది. ఆమె లేని జీవితం నేను ఊహించుకోలేను. ఈ బ్రతుకు నాకొద్దు. నేను కూడా చనిపోవాలని అనుకుంటున్నాను.’’ అని మురళీ తన లేఖలో రాశాడు. ఆ లేఖ చదివిన మురళీ కుటుంబ సభ్యులు కంగారుపడి.. మురళీ బస చేసిన హోటల్‌కు వెళ్లారు. కానీ, అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. హోటల్‌లోని ఓ గదిలో చీరతో ఉరేసుకుని ప్రాణాలు కోల్పోయాడు. మురళి కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మురళి మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మురళి మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

America Vs China: చైనాకు నిద్ర లేకుండా చేస్తున్న అమెరికా ఆ రెండు నిర్ణయాలు.. ఎందుకో తెలుసా?

Covid-19 Kits: బ్లాక్ మార్కెట్‌కు తరలివెళ్తున్న కోవిడ్ టెస్ట్ కిట్లు.. పక్కా సమాచారంతో పట్టుకున్న డ్రగ్స్ కంట్రోల్ అధికారులు

Ram Gopal Varma: వరంగల్‌లో సీక్రెట్‌‌గా పర్యటిస్తున్న వర్మ.. అసలు కారణం అదేనా..