
కాకినాడలో కలకలం రేపుతోంది కార్తికేయ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ. కష్టపడి పైసా పైసా కూడబెట్టుకున్నదంతా దోచేసి..బోర్డుతిప్పేసింది ఆ సంస్థ. పదో పరకో వస్తుందని ఆశపడి కూడబెట్టినదంతా కార్తికేయ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి అప్పజెప్పి ఇప్పుడు లబోదిబోమంటున్నారు కాకినాడలోని వందలాదిమంది ప్రజలు. మా దగ్గర డిపాజిట్ చేస్తే 13 శాతం వడ్డీ అనీ, మీ డబ్బుకి మేమే గ్యారంటీ అనీ నమ్మబలికి నట్టేట్లో ముంచేసింది కార్తికేయ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ. కాకినాడ లో జనం డబ్బులు దోచేసి, బోర్డు తిప్పేసింది కార్తీకేయ కోఆపరేటీవ్ బిల్డింగ్ సోసైటీ. పేద, మధ్యతరగతి ప్రజల దగ్గరనుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి, అడ్రస్‌లేకుండా పరారయ్యారు సొసైటీ బాధ్యులు. డా.బి.ఆర్. అంబేద్కర్ జిల్లాలో ఒక్కరో ఇద్దరో కాదు.. ఏకంగా 250 మంది ఖాతాదారులకు కుచ్చుటోపీ పెట్టింది ఈ సొసైటీ. సుమారు10 కోట్ల రూపాయల డిపాజిట్లు కట్టించుకుని ఎంచక్కా చెక్కేసారి మహా మాయగాళ్ళు. అందులో చాలా మందడిపాజిట్లకు గడవు పూర్తయినా ఖాతాదారులకు డబ్బులు చెల్లించకుండా పరారవడంతో జనం లబోదిబోమంటున్నారు.
కాగా బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టింది జిల్లా సహకార శాఖ. అధిక వడ్డీ ఆశతో బోల్తాకొట్టించారంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం