Bus Fire Accident: రాష్ట్రంలో మరో బస్సు ప్రమాదం.. నడిరోడ్డుపై కాలిపోయిన ట్రావెల్స్ బస్సు!
తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికుల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు వద్ద షార్ట్ సర్క్యూట్‌తో ఆర్ఆర్ఆర్ ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడగా, లగేజ్ కాలిపోయింది. ఇటీవల జరిగిన మరో ప్రమాదం నేపథ్యంలో ఇలాంటి ఘటనలు ప్రయాణ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాద ఘటనలు ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవలే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సులు ప్రమాదానికి గురై బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 20 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. ఈ ఘటన మరువక ముందే మరోసారి రాష్ట్రంలో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు గ్రామన్ బ్రిడ్జి వద్ద ట్రావెల్స్‌లోబస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధం అయింది. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు మంటలను అదుపులోకి తెచ్చారు.
వివరాల్లోకి వెళ్తే.. ఆర్ ఆర్ ఆర్ ట్రావెల్స్ చెందిన ఓ ట్రావెల్స్ బస్సు 10 మంది ప్రయాణికులతో ఖమ్మం నుంచి విశాఖపట్నం బయల్దేరింది. అయితే సిరిగ్గా తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు గ్రామన్ బ్రిడ్జి వద్దకు రాగానే బస్సలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. గమనించిన బస్సు డ్రైవర్ వెంటనే బస్సును పక్కకు ఆపేసి.. బస్సులో ఉన్న ప్రయాణికులను అందరిని కిందకు దించేశాడు. ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బంది సమాచారం ఇచ్చారు. అప్పటికే ప్రమాదాన్ని గమనించిన స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు కానీ ఎలాంటి ఫలితం లేకపోయింది.
ఇక సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కానీ అప్పటికీ బస్సు మొత్తం మంటల్లో కాలిపోయింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ప్రయాణికులు అందరూ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కానీ ప్రయాణికులకు సంబంధించిన లగేజ్‌లు మాత్రం బస్సులో ఉండిపోయినట్టు తెలుస్తోంది.
ఇక ప్రమాద సమచారాం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొన్ని రోడ్డుకు అడ్డంగా ఉన్న బస్సులో క్రేన్ సహాయంతో పక్కకు తీసే ప్రక్రియను ప్రారంభించారు. అనంతరం ట్రావెల్స్ యాజమాన్యానికి ఫోన్ చేసి.. ప్రయాణికులను మరో బస్సు సహాయంతో వాళ్ల గమ్యస్థానానికి పంపించే ఏర్పాట్లు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
