మంగళగిరి ఎయిమ్స్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు.. 10 లక్షల మైలురాయిని దాటిన..

ఉమ్మడి గుంటూరు జిల్లాయే కాకుండా ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి ప్రతినిత్యం భారీగా రోగులు తరలివస్తున్నారు. ఇక్కడ ఓపీ ఫీజు రూ.10 మాత్రమే. అనుభవజ్ఞులైన వైద్యులతో పాటు ఎంబీబీఎస్ విద్యార్ధులు ఇక్కడ సేవలు అందిస్తున్నారు.

మంగళగిరి ఎయిమ్స్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు.. 10 లక్షల మైలురాయిని దాటిన..
Aiims Mangalagiri

Updated on: Apr 06, 2023 | 8:57 PM

గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్‌)పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ ఆసుపత్రి 10 లక్షల మంది ఔట్ పేషెంట్స్‌కి సేవలందించింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ మంగళగిరి ఎయిమ్స్‌ సేవలను కొనియాడారు. ఇటీవలి మన్‌కీ బాత్ రేడియా కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. ఎయిమ్స్ వైద్యుడితో, టెలి కన్సల్టేషన్ ద్వారా వైద్య సలహా పొందిన రోగితో జరిపిన సంభాషణను వివరించారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా సైతం ఎయిమ్స్ మంగళగిరికి ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలియజేశారు.

2019 మార్చి 12న 44 మందితో ఎయిమ్స్ ఓపీ సేవలు ప్రారంభించింది. 2023 ఏప్రిల్‌ 3 సోమవారంతో ఓపీ సేవలు పొందిన వారి సంఖ్య 10 లక్షలు దాటింది. ఎయిమ్స్ నిర్మాణానికి కేంద్రం రూ 1681 కోట్లు కేటాయించింది. ఇందులో 98 శాతం వరకు నిర్మాణాలు పూర్తవ్వగా.. మరో 17 ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి రావాల్సి వుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..