మనదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు అయింది. మనిషి అన్ని విధాల ఆర్ధిక ఫలాలు అందుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అయితే కొన్ని చోట్ల మాత్రం కనీస అవసరాలకు కూడా దూరంగా ఉన్నాడు. ముఖ్యంగా మారుమూల అడవుల్లో నివసించే వారు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను దూరంగా ఉన్నాడు. కనీసం సరైన రవాణా సదుపాయాలకు కూడా నోచుకోకుండా ప్రాణాలను పణంగా పెట్టి జీవితాలను గడుపుతున్నారు. ముఖ్యంగా ఏపీలో విశాఖ మన్యం జిల్లాలోని అనేక గ్రామాలకు కనీస రవాణా సౌకర్యం లేదు.. సరైన రోడ్లు లేక.. ఏదైనా అత్యవస పరిస్థితులు ఏర్పడితే.. ప్రాణాలను కాపాడుకోవడానికి అనేక కష్టలు పడుతున్నారు. ముఖ్యంగా అల్లూరి జిల్లాలోని మారుమూల ప్రాంతాల ప్రజలకు రెండు కష్టాలు తప్పడం లేదు. రోగులు, గర్భిణీలు నానా అవస్థలు పడుతున్నారు. తాజాగా ఓ బాలింత రహదారి సౌకర్యం లేక ఐదు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించాల్సి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
జి మాడుగుల పెదబయలు సరిహద్దు చీకుపనస గ్రామానికి చెందిన దేవమ్మ అనే బాలింత రహదారి సౌకర్యం లేక ఐదు కిలోమీటర్లు కాలినడకన గ్రామానికి ప్రయాణం చేసింది. కె.దేవమ్మ జి.మాడుగుల ఆసుపత్రిలో 3 రోజులు క్రితం దేవమ్మకు ప్రసవం జరిగింది. ఈరోజు తల్లి బిడ్డను వాహనంలో చికుపనస తీసుకు వెళుతుండగా మార్గం మధ్యలో రోడ్డు సారిగ్గా లేక వాహనం నిలబెయాల్సి వచ్చింది. బ్రిడ్జి పనులు పూర్తి కాకపోవడంతో.. అక్కడ నుంచి వాహనం ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. దీంతో వాహనాన్ని ముందుకు తీసుకుని వెళ్లే పరిస్థితి లేకపోవడంతో వాహన డ్రైవర్ సింహాచలం బాలింతను బిడ్డను రోడ్డు మధ్యలో వదలి వేసాడు. దీంతో ఆమె తన బిడ్డను తీసుకుని ఐదు కిలోమీటర్లు నడిచి ఇంటికి చేరాల్సి వచ్చింది.
అదే గ్రామానికి చెందిన వ్యక్తి కి అనారోగ్యం కారణంగా డోలి మోత మోసారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా తమ గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేక అనారోగ్యాలతో మృత్యువాత పడుతున్నారని వాపోతున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రహదారి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు గిరిజనులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..