Telangana: పాల్ రావాలి – పాలన మారాలి.. తెలుగు రాష్ట్రాల్లో పర్యటనకు సిద్ధమవుతున్న కేఏ పాల్

|

Jul 07, 2022 | 7:20 AM

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ (KA.Paul) మరోసారి విచిత్రమైన కామెంట్స్‌ చేశారు. పార్టీని గెలిపించడానికి ఇదే చివరి అవకాశముంటూ ఓటర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. తెలంగాణలో 70శాతం ప్రజలు తనవైపే ఉన్నారన్న కేఏ పాల్ రెండు తెలుగు....

Telangana: పాల్ రావాలి - పాలన మారాలి.. తెలుగు రాష్ట్రాల్లో పర్యటనకు సిద్ధమవుతున్న కేఏ పాల్
Ka Paul
Follow us on

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ (KA.Paul) మరోసారి విచిత్రమైన కామెంట్స్‌ చేశారు. పార్టీని గెలిపించడానికి ఇదే చివరి అవకాశముంటూ ఓటర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. తెలంగాణలో 70శాతం ప్రజలు తనవైపే ఉన్నారన్న కేఏ పాల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ టూర్ (Political Tour) కు రెడీ అవుతున్నారు. ఏపీ, తెలంగాణలో రోడ్‌షోలు, భారీ బహిరంగ సభలకు ప్లాన్‌ చేశారు. పాల్‌ రావాలి-పాలన మారాలి అనే నినాదంతో తెలుగు రాష్ట్రాల్లో పర్యటించబోతున్నట్లు కేఏ పాల్ తెలిపారు. ఏపీలో జులై 9నుంచి పర్యటన మొదలవుతుందన్నారు. జులై 9న వైజాగ్‌, 10న విజయనగరంలో టూర్‌ ఉంటుదన్నారు. ఆ తర్వాత వరుసగా శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, ఒంగోలు, చిత్తూరు, అనంతపురం, కర్నూలులో పర్యటించనున్నారు. జులై 23నుంచి ఆగస్ట్‌ 1వరకు తెలంగాణలో టూర్‌ ఉంటుందన్నారు పాల్‌. ఇక, సెప్టెంబర్ నుంచి రెండు రాష్ట్రాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్పు కోరుకునేవారికి ఇదే చివరి అవకాశం అంటూ ఓటర్లకు బంపర్‌ ఆఫర్ ఇచ్చారు.

సర్వే అంటూ లెక్కలు చెప్పిన కేఏ పాల్‌ తెలంగాణలో 70శాతం ప్రజలు ప్రజాశాంతి పార్టీ వైపే ఉన్నారంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌ చేశారు. ఆ 30శాతానికి తనపై ఎందుకు ఇంకా నమ్మకం కలగడం లేదో తనకు తెలియడం లేదంటూ తనదైన స్టైల్లో మాట్లాడారు. అయితే, తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ప్రజాయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తనకు చెప్పుకోవచ్చంటూ ఆఫర్ కూడా ఇచ్చారు.