NSUI Protest: రోడ్లమీద గుంతలున్నాయని.. గుంత పునుగులు వేసి నిరసన తెలిపిన యువకులు.. ఎక్కడంటే..

| Edited By: Surya Kala

Jan 18, 2024 | 2:43 PM

గుంటూరు నగరంలో రోడ్లు గుంతలు పడి ప్రయాణానికి ఇబ్బందిగా ఉందంటూ ఎన్ ఎస్ యు ఐ కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తాము చేస్తున్న నిరసన పదిమందికి తెలియాలన్న ఉద్దేశంతో ఎక్కడైతే గుంటలున్నాయో అక్కడే గుంత పునుగులు వేసి తమ నిరసన తెలిపారు. నగరంలోని నందివెలుగు రోడ్డులోనే రైల్వే ప్లైఓవర్ నిర్మాణం జరుగుతోంది.

NSUI Protest: రోడ్లమీద గుంతలున్నాయని.. గుంత పునుగులు వేసి నిరసన తెలిపిన యువకులు.. ఎక్కడంటే..
Nsui Protest
Follow us on

నడి రోడ్డుపై పదిమంది యువకులు చేరారు. వారి చేతిలో చిన్న గ్యాస్ పొయ్యి ఉంది. అంతేకాదు కొద్దీగా పిండి, పునుగుల పెనం కూడా ఉన్నాయి. ఏకంగా నడిరోడ్డుపైనే పొయ్యి పెనం పెట్టి గుంత పునుగులు వేశారు. వేయడమే కాదు ఆ దారిలో వచ్చే పోయే వారికి వాటిని పంచి కూడా పెట్టారు కొంతమంది యువకులు. ఇదంతా ఏమిటి అని అనుకుంటున్నారా.. వివరాల్లోకి వెళ్తే..

గుంటూరు నగరంలో రోడ్లు గుంతలు పడి ప్రయాణానికి ఇబ్బందిగా ఉందంటూ ఎన్ ఎస్ యు ఐ కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తాము చేస్తున్న నిరసన పదిమందికి తెలియాలన్న ఉద్దేశంతో ఎక్కడైతే గుంటలున్నాయో అక్కడే గుంత పునుగులు వేసి తమ నిరసన తెలిపారు. నగరంలోని నందివెలుగు రోడ్డులోనే రైల్వే ప్లైఓవర్ నిర్మాణం జరుగుతోంది. ఈ క్రమంలోనే రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి. నిర్మానం జాప్యం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్ ఎస్ యు ఐ తమ నిరసన తెలియజేయాలనుకుంది. మామూలుగా నిరసన తెలిపితే ఎవరూ పట్టించుకోరన్న ఉద్దేశంతో వినూత్న నిరసనకు దిగారు.

నందివెలుగు రోడ్డులో గుంతలు పడిన రోడ్డుపైనే చిన్న గ్యాస్ స్టవ్ పోట్టారు. వెంటనే పెనం పెట్టి గుంత పునుగులు కూడా వేశారు. వాటిని ఆ దారిలో పోయే వాహనదారులకు పంచి పెట్టారు. అయితే ఈ విషయం తెలసుకుని పోలీసులు వచ్చే సమయానికే ఎన్ ఎస్ యు ఐ కార్యకర్తలు అక్కడ నుండి వెళ్లిపోయారు. నగరంలో రోడ్ల పరిస్థితి అధ్వాహ్నంగా ఉన్నాయని కార్పోరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని ఎన్ ఎస్ యు ఐ జిల్లా అద్యక్షుడు కరీం ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోడ్డు మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్ ఎస్ యు ఐ కార్యకర్తల వినూత్న నిరసనను స్థానికులు ఆసక్తిగా గమనించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..