Andhra News: గంగిరెద్దుకు క్యూఆర్​ కోడ్​.. జనరేషన్ మారింది గురూ

| Edited By: Ram Naramaneni

Jan 09, 2025 | 2:16 PM

ఇప్పుడంతా ఆన్ లైన్ పేమెంట్సే. జనాలు జేబులో డబ్బులు పెట్టుకోవడం మానేశారు. స్మార్ట్‌ఫోన్‌ చేతిలో ఉంటే సెకన్ల వ్యవధిలో పేమెంట్ చేసేయొచ్చు. QR కోడ్ ద్వారా ఇలా స్కాన్ చేసి.. అలా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. ఇప్పుడు బయటకెళ్లి టీ తాగి కూడా ఆన్ లైన్ ద్వారానే డబ్బులు చెల్లిస్తున్నారు జనాలు. అందుకే డూ డూ బసవన్నలు సైతం అప్ డేట్ అయ్యారు.

Andhra News: గంగిరెద్దుకు క్యూఆర్​ కోడ్​.. జనరేషన్ మారింది గురూ
QR Code Scanner On Ox
Follow us on

ప్రస్తుత జీవన విధానంలో మానవ జీవితం డిజిటల్ యుగం వైపు ఎంతో స్పీడుగా పరుగులు పెడుతుంది. మార్కెట్లో మనం ఏది కొనాలన్నా డిజిటల్ చెల్లింపులు తప్పనిసరిగా మారిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. మన నిత్యం తాగే పాల బిల్లు దగ్గరనుంచి కిరాణా, కరెంట్, పాన్ షాప్ ఇలా ఉప్పుకి పప్పుకి ఇలా ఎక్కడైనా సరే స్మార్ట్ ఫోన్ లో యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులకు అలవాటు పడిపోయాం. ప్రస్తుత పరిస్థితుల్లో యాచకులకు సైతం ఇవ్వాలన్న జేబులో చిల్లర ఉండని పరిస్థితి. ఈ పరిస్థితి కేవలం పట్టణాలకే కాక పల్లెలకు సైతం స్పీడ్ గా పాకిపోయింది. దాంతో మారిన ప్రపంచానికి తగ్గట్టుగా అందరూ డిజిటల్ పేమెంట్లవైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే పల్లెల్లో పండుగలకు ఊరూరా తిరిగే వేషదారుల సైతం యూపీఐ స్కానర్లను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే రాబోతున్న సంక్రాంతికి సందడి చేసే డూ డూ బసవన్నలు సైతం యుపిఎస్ స్కానర్లతో ప్రత్యక్షమవడం అందర్నీ ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఏలూరు జిల్లా ఇరిగేషన్ కార్యాలయంలో సిబ్బంది సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. సంబరాలలో భాగంగా విచిత్ర వేషధారణలు, రంగురంగుల రంగవల్లులు, సంబరాలు స్పెషల్ ఎట్రాక్షన్ గా గంగిరెద్దు ఆటలను ఏర్పాటు చేశారు. అయితే ఆ గంగిరెద్దు యజమాని దాని కొమ్ములకు యూపీఐ స్కానర్ ఏర్పాటు చేశాడు. దాంతో ఆ డూడూ బసవన్న ప్రదర్శన చూసి ఆనందించిన సిబ్బంది దానికి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో ఆ యూపీఐ స్కానర్ ద్వారా నగదు బదిలీ చేశారు. అలా ఉద్యోగులు స్కానర్ ద్వారా గంగిరెద్దుకు డిజిటల్ చెల్లింపులు చేయడం ఆసక్తికరంగా మారింది. ఆ స్కానర్ ఏర్పాటుచేసిన ఆ గంగిరెద్దు యజమాని మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఎవరి వద్ద చిల్లర డబ్బులు ఉండడం లేదని, గతంలో గంగిరెద్దు విన్యాసాలు చూసిన వారు కరెన్సీ నోట్లను కానుకలుగా ఇచ్చేవారని ప్రస్తుతం నగదు బదిలీ డిజిటల్ పేమెంట్ల రూపంలోకి మారిపోవడంతో కొంతకాలంగా గంగిరెద్దు విన్యాసాలకు వెళ్లినప్పుడు నగదు రాక ఇబ్బందులు ఎదుర్కొన్నామని, అందుకనే తాము కూడా విన్యాసాలు చేసే గంగిరెద్దుకు యుపిఐ స్కానర్ ఫిక్స్ చేసామని చెప్పారు. దీంతో ఎవరికి తోచినది వారు స్కానర్ ద్వారా డబ్బులు ఇస్తున్నారని ఇది తమకు సంతోషంగా ఉందని చెబుతున్నాడు. ఏది ఏమైనా డిజిటల్ చెల్లింపులు పెరిగిన నేపథ్యంలో మరికొద్ది కాలంలో కాగితాల ద్వారా తయారయ్యే కరెన్సీ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని పలువురు భావిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..