Andhra Pradesh: కృష్ణా జిల్లాకు సంబంధించి పేర్లపై ప్రధాన రాజకీయ పార్టీల నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. వంగవీటి రంగా పేరు పెట్టాలంటూ టీడీపీ నేత బోండా ఉమ దీక్ష చేపట్టారు. ఎన్టీఆర్ పేరు వ్యతిరేకిస్తూ.. కులాల మధ్య చిచ్చు పెట్టేలా టీడీపీ వ్యవహరిస్తోందని అధికార వైసీపీ విమర్శలు చేస్తోంది. దీక్ష కు, రాజకీయాలకు సంబందం లేదని, రంగా అభిమానులుగా, ప్రజల అభిప్రాయాన్నే తాము లేవనెత్తామని బోండా ఉమ అంటున్నారు.
కొత్త జిల్లాల విభజన ప్రకారం కృష్ణా జిల్లా కాస్తా విజయవాడ, మచిలీపట్నం జిల్లాలు అవుతున్నాయి. అయితే ఈ జిల్లాల పేర్లపై ఇప్పుడు రగడ మొదలైంది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. విజయవాడ కేంద్రంగా ఏర్పడుతున్న కొత్త జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని టీడీపీ నేత బోండా ఉమ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన దీక్ష చేపట్టారు.
ఎన్టీఆర్ పేరు పెడితే స్వాగతించకుండా.. కులాల మధ్య చిచ్చు పెట్టేలా టిడిపి వ్యవహరిస్తోందని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. దీనిపై టీడీపీ నేతలు దీక్షలు చేస్తున్నారని, చంద్రబాబు వెనుక ఉండి డ్రామాలాడిస్తున్నారని ఆరోపించారు. జిల్లాకో విధంగా టీడీపీ నేతలు కొత్త జిల్లాలపై రగడ చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఈ పని చేయలేదని ఆయన ప్రశ్నించారు. కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శలు చేస్తోంది.
కొడాలి నాని వ్యాఖ్యలపై టీడీపీ నేత బోండా ఉమ ఘాటుగా స్పందించారు. ఎన్టీఆర్ పేరును వ్యతిరేకిస్తూ ఎవరు? ఎక్కడ చెప్పారు? అని పరుష వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఓట్ల కోసం వంగవీటి రంగా విగ్రహాలు కావాలి, దండలు వేస్తారు, కానీ, ఆయన పేరు మాత్రం వద్దా? అని ప్రశ్నించారు. మెజారిటీ ప్రజల అభిప్రాయాన్నే తాము వ్యక్త పరిచామన్నారు. తాము చేపట్టిన దీక్ష రాజకీయాలకు అతీతంగా చేపట్టామన్నారు. ఈ దీక్షకు అన్ని పార్టీల నేతలు, రంగా అభిమానులు హాజరయ్యారని తెలిపారు బోండా ఉమ. మొత్తానికి జిల్లాల పేర్లపై ఇరు పార్టీల నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఈ పేర్ల పై జరుగుతున్న పొలిటికల్ ఫైట్ లో ఎవరిది పై చేయి..ఎవరికి మైలేజ్ వస్తుంది చూడాలి.
Also read:
Viral Photo: ఈ ఫోటోలోని బుడ్డోడు ఇప్పుడు టాలీవుడ్‌లో హీరోగా దూసుకుపోతున్నాడు.. ఎవరో గుర్తుపట్టారా..?
Yadadri Temple: ఏడేండ్ల కష్టానికి ఫలితం.. మరికొన్ని రోజుల్లో పునః ప్రారంభం కానున్న యాదాద్రి ఆలయం
DJ Tillu: సీక్వెల్‌కు సిద్ధమవుతున్న డిజే టిల్లు.. ఈసారి హీరో ఎవరో చెప్పేసిన నిర్మాత..