DJ Tillu: సీక్వెల్‏కు సిద్ధమవుతున్న డిజే టిల్లు.. ఈసారి హీరో ఎవరో చెప్పేసిన నిర్మాత..

DJ Tillu: సీక్వెల్‏కు సిద్ధమవుతున్న డిజే టిల్లు.. ఈసారి హీరో ఎవరో చెప్పేసిన నిర్మాత..
Dj Tillu

యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), హీరోయిన్ నేహా శెట్టి (Neha Shetty) జంటగా నటించిన సినిమా డిజే టిల్లు (Dj Tillu).

Rajitha Chanti

|

Feb 12, 2022 | 9:15 PM

యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), హీరోయిన్ నేహా శెట్టి (Neha Shetty) జంటగా నటించిన సినిమా డిజే టిల్లు (Dj Tillu). ఈ సినిమాను ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రానికి డైరెక్టర్ విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘డిజే టిల్లు’ విడుదల అయిన అన్ని కేంద్రాలలో, ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా తమ విజయానందాన్ని మీడియాతో పంచుకున్నారు చిత్ర నిర్మాత, హీరో, దర్శకుడు. అదేమిటో వారి మాటల్లోనే….

హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ…నేను ఇప్పటిదాకా బ్లాక్ బస్టర్ అనే మాట వినలేదు. ఇప్పుడు డిజె టిల్లుతో వింటున్నా. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఇవాళ తెలిసింది. చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మేము థియేటర్ లో 10శాతం వర్కవుట్ అవుతుంది అని అనుకున్న సీన్స్ అంతకు ఎన్నో రెట్లు ప్రేక్షకులు స్పందిస్తున్నారు. తమన్ గారి నేపథ్య సంగీతం సన్నివేశాలకు మరింత బలాన్ని ఇచ్చింది. నేను ఇక్కడి వాడినే అందుకే ఆ బాడీ లాంగ్వేజ్, మాటతీరు అన్నీ సహజంగా వచ్చాయి. స్వయంగా రాసుకున్న డైలాగ్స్ కాబట్టి సులువుగా డిజె టిల్లులా మాట్లాడగలిగా. ఇందాకే త్రివిక్రమ్ గారిని కలిసి వచ్చాం. ఆయన స్క్రిప్టు చూసి ఎక్కడ ఎంత రెస్పాన్స్ వస్తుందని చెప్పారో ఇవాళ థియేటర్ లో అదే రిపీట్ అవుతోంది. ఇది ఆయనకు సినిమా మీదున్న అవగాహనకు నిదర్శనం. ఆయన పరిచయం మా అదృష్టం. నిర్మాతకు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. అన్నారు.

నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ..డిజె టిల్లు కథ విన్నప్పుడే ఈ రకమైన స్పందన ప్రేక్షకుల నుంచి వస్తుందని ఊహించాం. ఇవాళ మా అంచనా నిజమైంది. సినిమా విజయం సాధిస్తుందని తెలుసు. అంతకంటే పెద్ద విజయాన్ని అందించారు. ఇలాంటి చిత్రాలతో సక్సెస్ అందుకున్నప్పుడే రిస్క్ చేయాలనే ధైర్యం కలుగుతుంది. ఇంకా కొత్త వాళ్లను ప్రోత్సహించాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు చిన్న సినిమా ఎందుకు చేస్తున్నారని గతంలో అడిగారు. ఇలాంటి ప్రాజెక్టులే ఎక్కువ సంతృప్తినిస్తాయి. ఏ స్థాయి సినిమా చేసినా మా సంస్థకున్న పేరును కాపాడుకోవాలి. రేపు భీమ్లా నాయక్ వస్తోంది. అది చూసిన వాళ్ళు డిజె టిల్లును ఏదో చుట్టేశారు అనుకోకూడదు. ఏ సినిమా అయినా మా సంస్థ గౌరవాన్ని నిలబెట్టేలా ఉండాలి. మేము అలాగే ప్లాన్ చేసుకుంటాం. డిజె టిల్లు సీక్వెల్ సినిమానే సిద్ధు నెక్ట్ పిక్చర్ గా చేస్తున్నాం. అన్నారు.

దర్శకుడు విమల్ కృష్ణ మాట్లాడుతూ…ఇవాళ థియేటర్ లకు వెళ్తి అక్కడ ప్రేక్షకుల సందడి చూసి నమ్మలేకపోయాం. డిజె టిల్లు కు మేము ఇంత క్రేజ్ సృష్టించామా అనిపించింది. సినిమాలో సంభాషణలకు వస్తున్న స్పందన,ఈ క్రెడిట్ అంతా నేను సిద్ధుకు ఇస్తాను. నిర్మాత నాగవంశీ గారి నమ్మకం, మా కష్టం అంతా ఇవాళ ఈ విజయానికి కారణం అంటూ ప్రస్తుతం ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నాను అన్నారు.

Also Read: Sudheer Babu: కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించిన సుధీర్‌ బాబు.. ఆసక్తికరంగా ఫస్ట్‌ లుక్‌..

Meenakshi Chaudhary: వరుస అవకాశాలు అందుకుంటున్న హర్యానా బ్యూటీ “మీనాక్షి చౌదరి”..(ఫొటోస్)

Geetha Madhuri: సెంటర్ అఫ్ ఎట్రాక్షన్ ‘గీత మాధురి’ ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో సింగర్ లేటెస్ట్ ఫొటోస్..

Keerthy Suresh : మహేష్ సినిమాకోసం ఈ ముద్దుగుమ్మ మొదటిసారి అలా కనిపించనుందట..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu