AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: బస్సు బ్యాక్‌ సీట్‌లో అనుమానంగా కనిపించిన బ్యాగ్.. ఏంటని ఓపెన్ చేయగా..

విజయవాడలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ బస్సులో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వాటిలో 46 జిలిటెన్ టిక్స్, భారీగా డిటోనేటర్లు ఉన్నట్టు గుర్తించారు . ఈ పేలుడు పదార్థాలు బస్సులోకి ఎలా వచ్చాయి.. ఎవరు వీటిని పెట్టారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Andhra News:  బస్సు బ్యాక్‌ సీట్‌లో అనుమానంగా కనిపించిన బ్యాగ్.. ఏంటని ఓపెన్ చేయగా..
Vijayawada Explosives Seized
Anand T
|

Updated on: Sep 15, 2026 | 9:32 AM

Share

విజయవాడలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. నగరంలోని ఓ బస్సులో భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. బస్సులోని ఓ బ్యాగులో పేలుడు పదార్థాలను గుర్తించిన ఓ ప్రయాణికుడు వెంటనే అప్రమత్తమై కృష్ణలంక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు .. హుటాహుటిన బస్సు దగ్గరకు చేరుకొని.. బస్సుల్లోని బ్యాగులో ఉన్న పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

ఆ బ్యాగులో 46 జిలెటిన్ స్టిక్స్, 50 డిటోనేటర్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బస్సు ప్రయాణించిన ప్రాంతాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారు, అలాగే బస్సులోని ప్రయాణికులకు వివరాలను సేకరిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us