Andhra Pradesh: ఏంటీ బ్రో ఇది..! రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకోవాలనుకున్న లైన్‌మెన్‌.. చివరి నిమిషంలో..

| Edited By: Jyothi Gadda

Jul 28, 2023 | 12:29 PM

kadapa: విద్యుత్ శాఖలో లైన్మెన్ గా పనిచేస్తున్నాడు రమేష్ అనేవ్యక్తి . కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకొని తనువుచాలలించాలని నిర్ణయించుకున్నాడు. చనిపోయే ముందు చివరిసారిగా కొడుకుకు మొబైల్ ద్వారా సమాచారం అందించాడు. తాను దూరంగా ఉన్నానని మరికొద్ది క్షణాల్లో రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకుంటానని

Andhra Pradesh: ఏంటీ బ్రో ఇది..! రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకోవాలనుకున్న లైన్‌మెన్‌..  చివరి నిమిషంలో..
Badvel Police Saves Lineman
Follow us on

కడప జిల్లా, జులై28: తనువు చాలించాలని నిచ్చయించాడు.. ఐతే కాసేపట్లో పోయే ప్రాణాలను ఊహించని రీతిలో ఒక నెంబర్ కాపాడింది. వివరాల్లోకివెళ్తే కడప జిల్లా బద్వేల్ పట్టణంలో విద్యుత్ శాఖలో లైన్మెన్ గా పనిచేస్తున్నాడు రమేష్ అనేవ్యక్తి . కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకొని తనువుచాలలించాలని నిర్ణయించుకున్నాడు. చనిపోయే ముందు చివరిసారిగా కొడుకుకు మొబైల్ ద్వారా సమాచారం అందించాడు. తాను దూరంగా ఉన్నానని మరికొద్ది క్షణాల్లో రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో కుటుంబ సభ్యులు షాక్ కు గురి అయ్యారు.

అప్పుడే రమేష్ కుమారునికి ఆలోచన వచ్చింది. తన తండ్రి ఆత్మహత్య ను ఎలాగైనా ఆపాలనుకున్నాడు. అప్పుడే అతని మదిలో ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. తన తండ్రిని ఎలాగైనా కాపాడాలని వేడుకున్నాడు. సమాచారం అందుకున్న సిద్దవటం యస్ఐ వెంటనే స్పందించారు. సిబ్బందితో కలసి రమేష్ ప్రాణాలు కాపాడటానికి రంగంలోకి దిగారు. సాంకేతిక పరిజ్ఞానం తో రమేష్ ఫోన్ ఎక్కడ ఉందొ లొకేషన్ కనుగొన్నాడు.

కనుమలోపల్లి వద్ద రైల్వే ట్రాక్ వద్ద ఉన్నట్టు గుర్తించారు. హుటాహుటిన ఆ ప్రాంతానికి వెళ్ళాడు. రైలు పట్టలపై పడుకుని చావడానికి సిద్ధంగా ఉన్న రమేష్ ను పక్కకు లాగి ప్రాణాలు కాపాడాడు. కొన్ని క్షణాలు ఆలస్యం అయి ఉంటే రమేష్ ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. సిద్ధవటం పోలీసులు విధి నిర్వహణలో అలసత్వం వహించకుండా వెంటనే స్పందించడంతో రమేష్ ప్రాణాలు కాపాడగలిగారు. సకాలంలో స్పందించి రమేష్ ప్రాణాలు కాపాడిన ఎస్ఐ ని జిల్లా ఎస్పి అన్బురాజన్ అభినందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..