Andhra Pradesh: పోలీసులను చూసి పారిపోయారు.. చేజ్‌ చేసి పట్టుకోగా అసలు విషయం

| Edited By: Narender Vaitla

Feb 06, 2024 | 10:17 PM

అలర్ట్ అయ్యేలోపే.. పోలీసులను చూసి వాళ్లు పరుగులు పెట్టారు. పోలీసులు వెంబడించారు. చేజ్ చేసి పట్టుకున్నారు. దీంతో కారులో చెక్‌ చేసి చూడగా అసలు విషయం బయటపడింది. వివరాల్లోకి వెళితే.. అల్లూరి జిల్లా లో పోలీసు లు ఎంత నిఘా పెడుతున్నా ... గంజాయి స్మగ్లర్లు ఖాకీల కళ్ళు గప్పేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు...

Andhra Pradesh: పోలీసులను చూసి పారిపోయారు.. చేజ్‌ చేసి పట్టుకోగా అసలు విషయం
Andhra Pradesh
Follow us on

గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. పోలీసులు ఎన్ని రకాలు చర్యలు తీసుకుంటున్నా. దొంగదారిలో గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ సంఘటన అల్లూరి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పోలీసుల సాధారణ తనిఖీల్లో భాగంగా ఓ చోట కాపు కాశారు. ఇంతలోనే ఓ కారులో కొందరు వ్యక్తులు అక్కడికి వచ్చారు. పోలీసులకు అనుమానస్పదంగా పోలీసులు కంటపడ్డారు.

అలర్ట్ అయ్యేలోపే.. పోలీసులను చూసి వాళ్లు పరుగులు పెట్టారు. పోలీసులు వెంబడించారు. చేజ్ చేసి పట్టుకున్నారు. దీంతో కారులో చెక్‌ చేసి చూడగా అసలు విషయం బయటపడింది. వివరాల్లోకి వెళితే.. అల్లూరి జిల్లా లో పోలీసు లు ఎంత నిఘా పెడుతున్నా … గంజాయి స్మగ్లర్లు ఖాకీల కళ్ళు గప్పేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంచంగిపుట్టు పోలీసులకు కీలక సమాచారం అందింది. దీంతో హుటాహుటిన.. లబ్బూరు జంక్షన్ కు వెళ్లారు. పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. బరడ గ్రామం వైపు నుంచి ఒడిశా రిజిస్ట్రేషన్ ( OD 08J 1818) నెంబరు గల విటారా బ్రీజా కారు అటుగా వచ్చింది.

అందులో ఉన్న నలుగురు అనుమానాస్పదంగా కనిపించారు. కారు ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఇంతలో పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు ఆ నలుగురు. దీంతో అలర్ట్‌ అయిన పోలీసులు వారిని వెంబడించారు. ఎట్టకేలకు పట్టుకుని విచారించగా.. కారులో గంజాయి గుట్టు బయటపడింది. కారులో 20 కేజీల గంజాయి గుర్తించి వాహనంతో గంజాయి, 60వేల నగదు సీజ్ చేశారు పోలీసులు. పట్టుబడిన నలుగురు ఒడిశా మల్కన్ గిరికి చెందిన వాళ్ళుగా గుర్తించారు. సిబా హంతల్, రమేష్ ఖిలా, మానస్ ఖిలా భీష్మ హంతల్ గా నలుగురు స్మగ్లర్లను గుర్తించి అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నారు. చేజ్‌ చేసి గంజాయి స్మగ్లర్లను పట్టుకున్న పోలీసు సిబ్బందిని అధికారులు అభినందించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..