AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రధాని మోదీ జ్ఞాపికల వేలంలో సంచలనం.. హనుమంతుడి విగ్రహానికి భారీ డిమాండ్‌..!

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహూకరించిన జ్ఞాపికల ఈ-వేలం ఆసక్తికరంగా కొనసాగుతోంది. వేలం ప్రారంభమై నెల రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో తక్కువ కనీస ధర కలిగిన వస్తువులకు ఎక్కువ మంది బిడ్డర్లు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా రూ.3,000 కనీస ధర ఉన్న నల్లరంగు హనుమంతుడి జ్ఞాపికకు అత్యధికంగా 47 బిడ్లు వచ్చాయి. ఈ వస్తువుకు గరిష్ఠంగా రూ.20,500 ధర పలికింది.

ప్రధాని మోదీ జ్ఞాపికల వేలంలో సంచలనం.. హనుమంతుడి విగ్రహానికి భారీ డిమాండ్‌..!
Pm Modi Mementos
Balaraju Goud
|

Updated on: Oct 19, 2026 | 12:37 PM

Share

న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహూకరించిన జ్ఞాపికల ఈ-వేలం ఆసక్తికరంగా కొనసాగుతోంది. వేలం ప్రారంభమై నెల రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో తక్కువ కనీస ధర కలిగిన వస్తువులకు ఎక్కువ మంది బిడ్డర్లు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా రూ.3,000 కనీస ధర ఉన్న నల్లరంగు హనుమంతుడి జ్ఞాపికకు అత్యధికంగా 47 బిడ్లు వచ్చాయి. ఈ వస్తువుకు గరిష్ఠంగా రూ.20,500 ధర పలికింది.

రామ దర్బార్‌కు సంబంధించిన బంగారు రేకు మెటాలిక్‌ ఆర్ట్‌ ప్రింట్‌ రెండో స్థానంలో నిలిచింది. రూ.1,500 కనీస ధర ఉన్న ఈ జ్ఞాపికకు 39 బిడ్లు రాగా, అత్యధిక బిడ్‌ రూ.9,000గా నమోదైంది. ఇక, అదే కనీస ధర కలిగిన మురుగన్‌ స్వామి బంగారు రేకు ఆర్ట్‌ ప్రింట్‌కు 34 బిడ్లు వచ్చాయి. ఈ వస్తువుకు అత్యధికంగా రూ.20,000 ఆఫర్‌ చేశారు.

చెక్కిన లోహపు ఒరతో ఉన్న కత్తికి కూడా మంచి స్పందన లభించింది. రూ.6,000 కనీస ధర కలిగిన ఈ జ్ఞాపికకు 33 బిడ్లు రాగా, అత్యధికంగా రూ.1 లక్ష ధర కోట్‌ చేశారు. అలంకరించిన ప్రభావళితో ఉన్న బాలాజీ విగ్రహానికి 26 బిడ్లు వచ్చాయి. రూ.27,000 కనీస ధర ఉన్న ఈ వస్తువుకు గరిష్ఠంగా రూ.45,000 ఆఫర్‌ చేశారు.

మోదీ జన్మదినమైన సెప్టెంబర్‌ 17న ప్రారంభమైన ఈ ఎనిమిదో విడత ఈ-వేలంలో దాదాపు 1,500 జ్ఞాపికలను అందుబాటులో ఉంచారు. అయితే, రూ.7.50 లక్షల కనీస ధర కలిగిన ఫ్రేమ్‌ చేసిన ‘ట్రీ ఆఫ్‌ లైఫ్‌’ గోండ్‌ పెయింటింగ్‌ వంటి ఖరీదైన వస్తువులకు ఇంకా బిడ్లు రాలేదు.

ఈ వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని గంగా నది పునరుజ్జీవన లక్ష్యంతో చేపట్టిన ‘నమామి గంగే’ కార్యక్రమానికి కేటాయించనున్నారు. 2019 నుంచి ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం సుమారు రూ.52 కోట్లు సమీకరించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us