PM Narendra Modi: అల్లూరి స్ఫూర్తితో యువత దేశాభివృద్ధికి నడుంబిగించాలి: ప్రధాని నరేంద్రమోడీ

PM Modi Bhimavaram Visit: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ఉత్సవాల్లో భాగంగా భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ (PM Narendra Modi) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన్యం వీరుడి 30 అడుగులు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.

PM Narendra Modi: అల్లూరి స్ఫూర్తితో యువత దేశాభివృద్ధికి నడుంబిగించాలి:  ప్రధాని నరేంద్రమోడీ
Pm Narendra Modi

Edited By: Ravi Kiran

Updated on: Jul 04, 2022 | 3:13 PM

PM Modi Bhimavaram Visit: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ఉత్సవాల్లో భాగంగా భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ (PM Narendra Modi) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన్యం వీరుడి 30 అడుగులు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం వేదికపై అల్లూరి కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌, సీఎం జగన్‌, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, మంత్రి రోజా, మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి, మెగాస్టార్‌ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. అల్లూరి కాంస్య విగ్రహావిష్కరణ అనంతరం మాట్లాడిన మోడీ.. మన్యం వీరుడి స్ఫూర్తితో దేశాభివృద్ధికి యువత నడుంబిగించాలని పిలుపునిచ్చారు.

ఆదీవాసిల అభివృద్ధికి కృషి చేస్తాం..
భారత్‌ మాతాకీ జై అన్న నినాదంతో తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు మోడీ.. ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా మన్యం వీరుడి 125వ జయంత్యుత్సవాలు జరుపుకోవడం సంతోషం. తెలుగు జాతి యుగ పురుషుడు అల్లూరి. ఆయన నడిచిన నేలలో నడవడం మనందరం చేసుకున్న అదృష్టం. భారతజాతి స్ఫూర్తి ప్రదాతగా అల్లూరి నిలిచారు. మన రాజ్యం మనదే అన్న నినాదంతో ఆయన ప్రజలను చైతన్యపరిచారు. అల్లూరి పిలుపుతోనే ఎంతో మంది యువకులు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది బలిదానాలు చేశారు. ఆంధ్ర రాష్ట్రం పుణ్యభూమి.. వీరభూమి. ఇక్కడకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ వీరభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. అల్లూరి చేపట్టిన రంప ఆందోళన ప్రారంభించి నేటికి వందేళ్లు పూర్తయింది. అల్లూరి సీతారామరాజు కుటుంబసభ్యులతో వేదిక పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆదివాసీల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషిచేస్తోంది. ఇందులో భాగంగా అల్లూరి నడయాడిన అన్ని ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం. దేశంలోని యువత అల్లూరి స్ఫూర్తితో ముందుకెళ్లాలి. దేశాభివృద్ధికి నడుంబిగించాలి’ అని మోడీ పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..