Andhra Pradesh: వైద్య సిబ్బందికి సలామ్ కొడుతున్న గ్రామస్తులు.. ఇంతకీ వారేం చేశారంటే..

Andhra Pradesh: చుట్టూ ముంచెత్తిన వరద నీరు.. మరోవైపు అనారోగ్య సమస్య.. పరిస్థితి విషమంగా ఉంది. అలాగని ఆస్పత్రికి వెళ్లే పరిస్థితి లేదు.

Andhra Pradesh: వైద్య సిబ్బందికి సలామ్ కొడుతున్న గ్రామస్తులు.. ఇంతకీ వారేం చేశారంటే..
Andhra Pradesh
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 15, 2022 | 9:42 AM

Andhra Pradesh: చుట్టూ ముంచెత్తిన వరద నీరు.. మరోవైపు అనారోగ్య సమస్య.. పరిస్థితి విషమంగా ఉంది. అలాగని ఆస్పత్రికి వెళ్లే పరిస్థితి లేదు. పోటెత్తుతున్న గోదావరి వరద నీటితో రహదారులన్నీ కనమరుగయ్యాయి. దాంతో దిక్కు తోచని పరిస్థితి ఆ కుటుంబానికి. చివరకు విషయాన్ని వైద్యాధికారులకు తెలియజేయగా.. సాహసం చేసి వచ్చారు వైద్యులు. అనారోగ్యంతో బాధపడుతున్న బాధితురాలికి తక్షణ చికిత్స అందించి ప్రాణాలు నిలిపారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఠాణేలంక గ్రామంలో చోటు చేసుకుంది.

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఠాణేలంక గ్రామానికి చెందిన జగతాడి వెంకాయమ్మ(82) ఆరోగ్యం క్షీణించింది. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్దామంటూ.. గ్రామం మొత్తంలో గోదావరి వరదల్లో చిక్కుకుపోయింది. చాతి వరకు నీరు ప్రవాహనిస్తోంది. దారులన్నీ కనుమరుగయ్యాయి. దాంతో ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడ్డారు కుటుంబ సభ్యులు. చివరకు ఆమె ఆరోగ్యం మరింత క్షీణిస్తుండటంతో.. కుటుంబ సభ్యులు వైద్య సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కొత్తలంక పిహెచ్‌సీ వైద్య సిబ్బంది.. గుండెల లోతో వరద నీటిలోనూ ఠాణేలంక గ్రామానికి వచ్చారు. వైద్య సిబ్బంది నాయుడు, ఆశాకార్యకర్త సత్యవతి.. ఇద్దరూ ఆ వృద్ధురాలికి వైద్య పరీక్షలు చేశారు. వృద్ధురాలికి షుగర్ లెవెల్స్ తగ్గి పరిస్థితి విష మించడంతో హుటాహుటిన వృద్ధురాలిని కుటుంబ సభ్యులు, వైద్య సిబ్బంది సహాయంతో వరద నీటిలోనే మోసుకుంటూ అంబులెన్స్ వద్దకు తీసుకువచ్చి ప్రాథమిక చికిత్స చేసి, ముమ్మిడివరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలనికి తరలించారు. దాంతో ఇప్పుడు ఆమె క్షేమంగా ఉంది. కాగా, వరదల్లోనూ వృదురాలికి వైద్యం అందించిన వైద్య సిబ్బంది సేవలను గ్రామస్తులు కొనియాడారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..