Perni Nani: ఏపీలోనే నిర్మాతలకు ఎక్కువ షేర్‌.. జనసేన అధినేత పవన్‌కు మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్‌ కౌంటర్..

|

Sep 26, 2021 | 4:48 PM

Perni Nani slams Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ కావాలని అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. పవన్ మాటలు

Perni Nani: ఏపీలోనే నిర్మాతలకు ఎక్కువ షేర్‌.. జనసేన అధినేత పవన్‌కు మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్‌ కౌంటర్..
Perni Nani Slams Pawan Kalyan
Follow us on

Perni Nani slams Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ కావాలని అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. పవన్ మాటలు జగన్ మీద విషం చిమ్మెలా ఉన్నాయని పేర్కొన్నారు. ఏపీలో 800 థియేటర్లల్లో సినిమాలు ఆడుతున్నాయని పేర్ని నాని పేర్కొ్న్నారు. తెలంగాణలో 413 మాత్రమే నడుస్తున్నాయన్నారు. లవ్ స్టోరీ సినిమాకు ఏపీలోనే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయన్నారు. కేసీఆర్ ను పవన్ కల్యాణ్ తిట్టే ధైర్యం లేదని.. పేర్కొన్నారు. సాయితేజ్ ప్రమాదం గురించి పోలీసులు చెప్పిందే మీడియా చెప్పిందని పేర్ని నాని తెలిపారు. దీనిపై పవన్‌ తెలంగాణ పోలీసులను ప్రశ్నించాలని సూచించారు. సిని పరిశ్రమకు ఏ విధంగా ఇబ్బంది పెట్టామో చెప్పాలని నాని తెలిపారు. సినీ నిర్మాతలకు ఏపీలోనే ఎక్కువ షేర్‌ వస్తుందని నాని తెలిపారు. పవన్ కు కేంద్రంలో సినిమా లేదని.. అంతా సొల్లు చెబుతారంటూ పేర్కొన్నారు. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చి మాట్లాడితే కుదరదంటూ పేర్కొన్నారు.

సినిమా థియేటర్లను ఏపీ ప్రభుత్వం మూసి వేయించిందని.. పవన్ కళ్యాణ్‌ అంటున్నారని ఇదంతా అబద్దం అన్నారు. ఏపీలో 1100 థియేటర్స్..ఉంటే 800 థియేటర్లు తెరిచారన్నారు. తెలంగాణలో 519 ఉంటే..413 థియేటర్లు మాత్రమే తెరిచారన్నారు. ఏపీలో మూడు రోజుల నుంచి 510 థియేటర్స్‌లో లవ్ స్టోరీ సినిమా ఆడుతుందని.. ఏపీలో మొదటి రోజు నిర్మాతకి వచ్చింది 3కోట్ల 81 లక్షలని పేర్కొన్నారు. రెండవ రోజు నిర్మాత షేర్.. 2 కోట్ల 80 లక్షలని తెలిపారు. జగన్ పై విషం చిమ్మడానికే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారని.. దీనిపై నిర్మాత మాట్లాడాలని నాని డిమాండ్‌ చేశారు. రిపబ్లిక్ ఇండియా కనుక..ఏమి మాట్లాడినా చెల్లుతుందంటూ నాని పేర్కొన్నారు. నా కోసం బందరు వచ్చి తిట్టావు.. నీ మనసు నిండా నేను ఉన్నానంటూ నాని పవన్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. కోడికత్తి కేసు ఎన్ఐఏ చూస్తోందని.. దమ్ముంటే అమిత్ షా అడుగు అంటూ నాని సూచించారు. మీకు టాక్స్‌లు, జిఎస్టీ ఎందుకు కట్టాలని కేంద్రాన్ని ప్రశ్నించాలంటూ సూచించారు.

Also Read:

Mahesh Babu: పవన్ కళ్యాణ్ ఆడియో ఫంక్షన్‌లో చాలా బాగా మాట్లాడాడు.. నేను బాగా ఇష్టపడే వ్యక్తి పవన్.. వైరల్ అవుతున్న మహేష్ ఓల్డ్ ట్వీట్

ఎల్‌ఐసీ నుంచి ప్రీమియం చెల్లించకుండా 75 వేల ప్రయోజనం..! పిల్లలకు స్కాలర్‌షిప్ అవకాశం..?