సీఎం జగన్ మచిలీపట్నం సభలో మాజీ మంత్రి పేర్నినాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్‌తో కలిసి ఇదే నా చివరి మీటింగ్ అని చెప్పారు. ఇకపై జగన్‌తో కలిసి సభలో పాల్గొనే అవకాశం ఉండకపోవచ్చని అందుకే ఇంత సేపు మాట్లాడుతున్నానంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కాగా రూ.5,156 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బందర్ పోర్ట్ పనులకు ఇవాళ (మే22) శంకుస్థాపన చేశారు సీఎం జగన్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని, ఎంపీ బౌలశౌరి తదితర ప్రముఖులు మాట్లాడారు. అయితే దాదాపు ముప్పావు గంట పాటు మాట్లాడిన నాని తన రాజకీయ భవితవ్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్‌పై ప్రశంసలు కురిపిస్తూనే తనకు జగన్‌తో ఇదే చివరి మీటింగ్ కావచ్చంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ లోపు వేదికపై నుంచి ఎమ్మెల్సీ రఘురాం తో మరికొందరు ఇక చాలంటూ వెనుక నుంచి వారించారు. కానీ పేర్ని మాత్రం ఆపకుండా ప్రసంగాన్ని కొనసాగించాడు. మొత్తానికి రాజకీయాల నుంచి ఇక రిటైర్ అయిపోతానన్న సంకేతాలు ఇచ్చారు పేర్ని నాని. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
‘ పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. బందరు అభివృద్ధికి ఆయన శ్రీకారం చుట్టారు. తద్వారా బందరకు పూర్వ వైభవం రానుంది. కానీ నక్కజిత్తుల చంద్రబాబు బందరు పోర్టు ముందుకు వెళ్లకుండా కోర్టులకు వెళ్లారు. అయితే వాటన్నింటిని ఎదురొడ్డి మరీ బందరు వాసుల కలను సీఎం జగన్ నెరవేర్చారు. బందరు నియోజకవర్గంలో 25,090 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. అలాగే సీఎం జగన్ బందరులో గోల్డ్ కవరింగ్ యూనిట్‌లను నిలబెట్టారు. ఏపీలో 31లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చిన నాయకుడు దేశంలోనే ఎవరూ లేరు. సీఎం జగన్ చెప్పాడంటే.. చేస్తాడంతే’ అని ఏకధాటిగా మాట్లాడారు పేర్ని నాని.
మరిన్ని ఏపీ వార్తల కోసం.. క్లిక్ చేయండి..