Andhra Pradesh: కర్నూలు జిల్లాలో క్షుద్రపూజల కలకలం.. ఏకంగా సీఈవో పైనే దాడికి దిగిన సిబ్బంది..!

Andhra Pradesh: కాలం ఎంత ముందుకు పోతున్నా.. కొందరు మాత్రం అక్కడే ఉంటున్నారు. మూఢనమ్మకాలతో దాడులకు దిగుతున్నారు.

Andhra Pradesh: కర్నూలు జిల్లాలో క్షుద్రపూజల కలకలం.. ఏకంగా సీఈవో పైనే దాడికి దిగిన సిబ్బంది..!
Black Magic
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 14, 2022 | 5:11 AM

Andhra Pradesh: కాలం ఎంత ముందుకు పోతున్నా.. కొందరు మాత్రం అక్కడే ఉంటున్నారు. మూఢనమ్మకాలతో దాడులకు దిగుతున్నారు. అటు ప్రభుత్వాలు.. ఇటు జనవిజ్ఞాన వేదికలు చేతబడులను నమ్మొద్దని.. అదంతా ట్రాష్‌ అంటూ అవగాహన కల్పిస్తున్నా.. ప్రయోజనంలేకుండా పోతోంది. తాజాగా కర్నూలు జిల్లాలో క్షద్రపూజలు కలకలం రేపాయి. చేతబడి చేయిస్తున్నాడని ఆరోపిస్తూ దాడులకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు కల్పించుకుని సర్దిచెప్పడంతో వివాదం కాస్త సద్దుమణిగింది. అసలు వివరాల్లోకెళితే.. మంత్రాలయం మండల కల్దేవకుంట సహకార సంఘం సీఈవోపై సిబ్బంది దాడి చేశారు. సహకార సంఘం సీఈవో వెంకటేశ్‌ తమపై చేతబడి చేయిస్తున్నాడంటూ సిబ్బంది ఆగ్రహంతో ఊగిపోయారు. కార్యాయంలోకి దూసుకెళ్లి వెంకటేశ్‌పై దాడికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు సహకార సంఘం సీఈవో వెంకటేశ్‌. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. వెంకటేశ్‌పై దాడికి దిగిన సిబ్బందిని సముదాయించారు. చేతబడి చేసినట్లు ఉన్న ఆనవాళ్లను పరిశీలించారు.

అయితే, తానెలాంటి క్షుద్రపూజలకు పాల్పడలేదని పోలీసులకు గోడు వెళ్లబోసుకున్నాడు వెంకటేశ్‌. ఎంత చెప్పినా వినకుండా తనపై సిబ్బంది దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. మూఢనమ్మకాలను వీడాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

Also read:

IPL 2022: రాత మారని ముంబై ఇండియన్స్.. 12 పరుగుల తేడాతో పంజాబ్‌ గెలుపు..

Sonu Sood: నా భార్య రక్తం తాగుతోందని నెటిజన్‌ ట్వీట్‌.. సోనూ సూద్ ఏం సమాధానం ఇచ్చాడో తెలుసా?

Viral Photo: ఈ ఫోటోలో పాము దాగుంది.. కనిపెడితే మీరు గ్రేటే.. చాలా కష్టం