జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి కృష్ణా జిల్లా పర్యటన ముగిసింది. ఒకటి కాదు…రెండు కాదు…ఏకంగా నాలుగు రోజులు జిల్లా కేంద్రం మచిలీపట్నంలోనే పవన్ ఉన్నారు..అక్కడి నుంచే జిల్లా పర్యటనలు చేశారు. అయితే అక్కడి ఎమ్మెల్యే పేర్ని నానిని ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది.
ఒకప్పుడు నువ్వానేనా అన్నట్లు విమర్శలు చేసుకున్న ఈ ఇద్దరి నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. దీంతో పవన్ కృష్ణా జిల్లా పర్యటనలో కచ్చితంగా పేర్నిని టార్గెట్ చేస్తారని అంతా ఊహించారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రసంగాల్లో పేర్ని నాని ప్రస్తావన లేకపోవడంతో అసలేం జరిగి ఉంటుందన్న చర్చ జరుగుతోంది. ఉన్నపలంగా ఇంత మార్పు రావడానికి కారణం ఏంటని చెవులు కొరుక్కుంటున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి కృష్ణా జిల్లా పర్యటన ముగిసింది.. ఈ నెల ఒకటి నుంచి ఐదు రోజుల పాటు జిల్లాలో పర్యటన సాగింది. మొదటి రోజు అవనిగడ్డ నుంచి ప్రారంభమైన యాత్ర అక్కడి నుంచి మచిలీపట్నం కు షిఫ్ట్ అయింది. నాలుగు రోజుల పాటు బందరు కేంద్రంగా జిల్లా పర్యటన చేశారు పవన్ కళ్యాణ్. మచిలీపట్నం లో నాలుగు రోజులున్నా.. స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని పై చిన్న విమర్శ కూడా చేయలేదు. ఏ నియోజకవర్గానికి వెళ్లినా….స్థానిక ఎమ్మెల్యే పై ఏదో ఒక విమర్శ లేదా ఆరోపణలు చేస్తూ వస్తోన్న పవన్.. మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని పై చిన్న కామెంట్ కూడా చేయలేదు.
మచిలీపట్నంలో వారాహి బహిరంగ సభ లేకుండానే టూర్ ముగించేశారు. పేర్నినాని గురించి పవన్ ప్రస్తావన తీసుకురాకపోవడంతో ఇంతకీ పవన్ మౌనం వ్యూహాత్మకమా?లేక వేరే కారణం ఉందా? అన్న చర్చ జరుగుతోంది. ఇటీవల చెప్పుల విషయంలో కూడా పవన్ కు పేర్ని కి మధ్య మాటల యుద్ధమే జరిగింది…వైసీపీ కి పవన్ చెప్పులు చూపిస్తే దానికి ధీటుగా రెండు చెప్పులు చూపిస్తూ కౌంటర్ ఇచ్చారు పేర్ని…. దీంతో జిల్లా పర్యటనలో పేర్ని టార్గెట్ గా పవన్ రాజకీయం చేస్తారని అందరూ భావించారు. కానీ దీనికి పూర్తి విరుద్ధంగా పవన్ పర్యటన సాగింది.
ఇక గత మార్చిలో జనసేన ఆవిర్భావ సభ కూడా మచిలీపట్నం లోనే జరిగింది…ఆరోజు కూడా పేర్ని పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు… అన్ని నియోజకవర్గాల్లో స్థానిక నేతలపై విరుచుకుపడుతున్న జనసేన అధినేత….బందరు లో మాత్రం మౌనంగా ఉండటం పై రకరకాల ప్రచారం జరుగుతోంది. అయితే పేర్నీ విషయంలో పవన్ అసలు స్ట్రాటజీ ఏంటో తెలియాలంటే పవన్ స్వయంగా స్పందిస్తే కానీ తెలియదు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..