Anna Lezhneva: తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ కల్యాణ్ సతీమణి అనా కొణిదెల

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భార్య అనా కొణిదెల ఆదివారం తిరుమలకు వెళ్లారు. సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడటంతో అనా కొణిదెల స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె శ్రీవారికి తలనీలాలు ఇచ్చారు.

Anna Lezhneva: తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ కల్యాణ్ సతీమణి అనా కొణిదెల
Anna Lezhneva

Updated on: Apr 13, 2025 | 9:22 PM

ఇటీవల సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్.. స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడిన విషయం తెలిసిందే. దీంతో పవన్ సతీమణి అనా కొణిదెల తిరుమల శ్రీవారిని దర్శనానికి వెళ్లి తలనీలాలు సమర్పించారు. సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో ఆమె శ్రీవారిని దర్శించుకుంటారు. ఈ మేరకు ఆమె టీటీడీకి డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ నియమాల ప్రకారం అన్య మతస్థులు తిరుమల వెంకన్న దర్శనానికి వస్తే శ్రీవారిపై నమ్మకం ఉందంటూ తిరుమల తిరుపతి దేవస్థానానికి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు అన్నా కొణిదెల గాయత్రి సదనంలో డిక్లరేషన్ పత్రాలపై సైన్ చేశారు.

ఆదివారం రాత్రి అనా కొణిదెల వరాహ స్వామిని దర్శించుకున్నారు. పవన్ ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో..  తిరుమలకు అన్నా కొణిదెల ఒక్కరే వెళ్లినట్లు సమాచారం.

వీడియో దిగువన చూడండి…

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.