ఏపీలో జగనన్న ఇళ్ల పేరుతో పెద్ద స్కామ్ జరిగిందని ఆరోపించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఇళ్ల నిర్మాణానికి కేంద్రప్రభుత్వం నిధులు ఇస్తుంది.. నిధులు పక్కదారి పట్టాయన్నారు. ప్రభుత్వం చెప్పిన ధర ఒకటి ప్రభుత్వం పెద్దలు దోచుకుంది మరొకటి.. అసలు ఇళ్ల పేరుతో కేటాయించిన రూ. 23,400 కోట్లలో పెద్ద ఎత్తున దోపిడీ చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు జనసేనాని. జగనన్న ఇళ్ల పేరుతో జరిగిన అవినీతిపై ప్రధాని మోదీకి స్వయంగా తానే నివేదిక ఇస్తానని చెప్పారు. ప్రభుత్వ అక్రమాలను ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని పిలుపునిచ్చారు..అధికారంలోకి వస్తే ఇసుక ఉచితంగా ఇస్తామని ప్రకటించిన.. పవన్ ప్రస్తుతం ఉన్న ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా తొలగించమని స్పష్టం చేశారు..!
జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా గుంకలాంలో పర్యటించారు పవన్..YCP నేతలు ఢిల్లీకి వెళ్లి తనపై చాడీలు చెబుతున్నారని విమర్శించారు పవన్. తాను మాత్రం ఎక్కడి సమస్యలు అక్కడే తేలుస్తానని చెప్పారు..! కేసులు పెట్టినా.. చంపుతామని బెదిరించినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు..
జగనన్న ఇళ్లు.. పేదలందరికీ కన్నీళ్లు.. పేరుతో జనసేన పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లాలోని గుంకలాంలో జగనన్న కాలనీని పవన్ పారిశీలించారు. విశాఖ పట్నం నుంచి విజయనగరం వెళ్లే రహదారిలో పవన్‌కు అడుగడుగునా జనసేన నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. పవన్‌ను చూసేందుకు భారీగా అభిమానులు, జనసైనికులు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..