Pawan Kalyan: 15ఏళ్లు కూటమిదే అధికారం.. అవన్నీ తట్టుకుని నిలబడతాం.. పవన్ అదిరే స్పీచ్..

ప్రధాని మోదీని కర్మయోగిగా అభివర్ణించిన పవన్.. ఆయన ఎలాంటి లాభాపేక్ష లేకుండా దేశానికి సేవ చేస్తున్నారని అన్నారు. భారత్‌ను అగ్రగామిగా నిలిపేందుకు నిరంతంర శ్రమిస్తున్నారని తెలిపారు. జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. అలాగే ఏపీలో కూటమి ప్రభుత్వం 15 ఏళ్లు బలంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

Pawan Kalyan: 15ఏళ్లు కూటమిదే అధికారం.. అవన్నీ తట్టుకుని నిలబడతాం.. పవన్ అదిరే స్పీచ్..
Pawan And Lokesh Hails Pm Modi

Updated on: Oct 16, 2025 | 4:37 PM

ప్రధాని మోదీపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. ధర్మాన్ని పాటిస్తూ కర్మను పాటించే నాయకుడు మోదీ అని అన్నారు. కర్నూలులో జరిగిన జీఎస్టీ 2.0 సభకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్.. ప్రధాని మోదీని కర్మయోగి అని అన్నారు. ఎలాంటి ఫలితాలను ఆశించకుండా సేవ చేస్తున్నారని.. భారత్‌ను అగ్రగ్రామిగా నిలుపుతున్నారని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఏపీలో కూటమి 15 ఏళ్లకు తక్కువ కాకుండా బలంగా ఉండాలని ఆకాంక్షించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా తట్టుకుని నిలబడి ఉంటామని చెప్పారు. మోదీ నాయకత్వంలో సమిష్టిగా ముందుకు వెళ్తామని పవన్ అన్నారు.

రెండు తరాలను..

ఇక జీఎస్టీ వల్ల అన్ని వర్గాలకు మేలు జరురగుతుందని పవన్ అన్నారు. జీఎస్టీ సంస్కరణలు తెచ్చిన ప్రధానికి 5కోట్ల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. గతంలో పన్నులు పెరగడమే అందరికీ తెలుసన్న పవన్.. మోదీ హయాంలో పన్నులు తగ్గడం చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ దేశాన్ని కాదు రెండు తరాలను నడుతుపుతున్నారని అన్నారు.

నమో అంటేనే విక్టరీ – లోకేశ్

అంతకుముందు మంత్రి నారా లోకేశ్ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని సూపర్‌ పవర్‌గా మార్చింది మోదీనే అని అన్నారు. నమో అంటేనే విక్టరీ అని.. మోదీ ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతమే అవుతుందని చెప్పారు. ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్తాన్‌కు బుద్ది చెప్పారని.. మోదీ దెబ్బకు పాకిస్తాన్‌ దిమ్మతిరిగిందన్నారు. ట్రంప్‌ టారిఫ్‌లతో పెద్ద పెద్ద దేశాలు వణికినా.. మోదీ మాత్రం బెదరలేదని వ్యాఖ్యానించారు. దసరా, దీపావళి కలిసి వస్తే ఇలానే ఉంటుందన్నారు. మోదీ లక్ష్యం పేదరికం లేని దేశం అని.. అందుకోసం నిరంతం శ్రమిస్తున్నారని తెలిపారు.


మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..