Kurnool: కర్నూలులో ప్రధాని మోదీ బహిరంగ సభ .. లైవ్ చూడండి
శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు ప్రధాని మోదీ. భ్రమరాంబ మల్లికార్జునస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీశైలం మల్లికార్జునస్వామికి పంచామృతాలతో రుద్రాభిషేకం.. భ్రమరాంబదేవికి ఖడ్గమాల, కుంకుమార్చన పూజలు చేశారు. 50 నిమిషాలపాటు మల్లన్న సన్నిధిలో గడిపారు మోదీ.శ్రీశైలం క్షేత్రంలో ప్రధాని మోదీకి అర్చకులు, ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం, ప్రధాని మోదీకి వేద ఆశీర్వాదం అందించారు అర్చకులు. ప్రధానితోపాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కూడా శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు.
ప్రధాని మోదీ ఏపీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం అనంతరం ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్’ పేరుతో కర్నూలు శివారులోని నన్నూరులో జరుగుతున్న భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణలను ఈ సభలో ఆయన వివరించారు. లక్షలాది మంది ప్రజలు సభకు హాజరయ్యారు.
అంతకుముందు శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు ప్రధాని మోదీ. భ్రమరాంబ మల్లికార్జునస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీశైలం మల్లికార్జునస్వామికి పంచామృతాలతో రుద్రాభిషేకం చేశారు. భ్రమరాంబదేవికి ఖడ్గమాల, కుంకుమార్చన పూజలు చేశారు. 50 నిమిషాలపాటు మల్లన్న సన్నిధిలో గడిపారు మోదీ.
శ్రీశైలంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రంలో సుమారు 40నిమిషాలపాటు గడిపారు ప్రధాని మోదీ. శివాజీ దర్బార్ హాల్, ధ్యాన మందిరాలను తిలకించారు. శివాజీకి శ్రీశైలంతో ఉన్న అనుబంధాన్ని అడిగి తెలుసుకున్నారు.
అంతకు ముందు శ్రీశైలం క్షేత్రానికి వచ్చిన ప్రధాని మోదీకి…అర్చకులు, ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శ్రీశైలం చేరుకున్నారు. ఆ తర్వాత మోదీకి వేద ఆశీర్వచనం ఇచ్చి…తీర్థ ప్రసాదం అందించారు పండితులు.
ముందుగా కర్నూలు ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాని మోదీకి గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్.. ఘనస్వాగతం పలికారు. అక్కడ్నుంచి హెలికాప్టర్‌లో శ్రీశైలం చేరుకుని మల్లన్న సేవ పాల్గొన్నారు మోదీ. శ్రీశైలం రహదారిలో అడుగడుగునా గ్రాండ్‌వెల్‌కమ్ పలికారు ప్రజలు.
ప్రధాని మోదీ పర్యటనతో రాష్ట్రమంతటా పాజిటివ్ వైబ్ ఉందంటున్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో శరవేగంగా రాష్ట్రాభివృద్ధి జరుగుతోందన్నారు. రానున్న రోజుల్లోను కూటమి పాలన బాగుంటుందన్నారు పల్లా.
ప్రకాశం జిల్లా దోర్నాలలోని ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర శ్రీశైలం వైపు వెళ్ళే వాహనాలను నిలిపి వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ…శ్రీశైలం పర్యటనతో వాహనాలను ఆపారు పోలీసులు. కొద్దిసేపటి తరువాత శ్రీశైలం వెళ్ళే వాహనాలకు అనుమతి ఇస్తామని మార్కాపురం డీఎస్పీ నాగరాజు తెలిపారు. ఆర్టీసీ బస్సులతో పాటు టూరిస్ట్ బస్సులను ఆపడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.
కర్నూలు జిల్లా నన్నూరు పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ప్రధాని మోదీ. ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్లు సహా 13వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఆ తర్వాత.. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ కూటమి నేతలతో కలిసి సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ పేరుతో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొన్నారు.
ప్రధాని మోదీ కర్నూలు పర్యటనకు కూటమి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. 12 మంది మంత్రుల బృందం కర్నూలులో మకాం వేసి.. ఏర్పాట్లను దగ్గర ఉండి పరిశీలించింది. ప్రధాని మోదీ సభకు భారీ జనసమీకరణ చేశారు కూటమి నేతలు. దాదాపు మూడు లక్షల మంది వరకూ కూర్చునేందుకు వీలుగా భారీ ఏర్పాట్లు చేశారు. 7 వేల ప్రత్యేక బస్సులను ఇందుకు వినియోగిస్తున్నారు. 7వేల 500 మందికి పైగా పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఈ ఏడాది మూడోసారి ఏపీకి వచ్చారు ప్రధాని మోదీ. జనవరి 9న విశాఖలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మే 2న అమరావతి రీలాంచ్ కార్యక్రమానికి హాజరయ్యారు మోదీ. ఈసారి రాయలసీమలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ.
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు
ప్రపంచంలోనే 'లాంగెస్ట్' ఫ్లైట్ చూసారా..
నెలకు రూ. 8 వేలు జీతం.. కానీ రూ.13 కోట్ల జీఎస్టీ నోటీసు అందుకుంది
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చారు.. కళ్లలో స్ప్రే కొట్టి..
యూట్యూబ్ చూసి ఆపరేషన్.. చివరికి..
మొదటిరాత్రి కోసం ఆశగా ఎదురుచూసిన వధువుకు ఊహించని షాక్..
హైదరాబాద్కు బీచ్ వచ్చేస్తోందోచ్

