Pawan Kalyan 3rd Varahi Yatra: 2024 అసెంబ్లీ ఎన్నికల ప్లానింగ్ ఎలా ఉండనుంది.. పొత్తులతో దుసుకెళ్లనున్నారా..? పొత్తులు కోసం ప్రాణాళిక ప్రారంభమైందా..? పవన్ కల్యాణ్ వారాహి యాత్ర 3వ ఎపిసోడ్ త్వరలో జరగనుందా.. అందుకోసమే జనసేనాని ఇవాళ మంగళగిరిలోని పార్టీ ఆఫీసుకొచ్చారా..? అందుకే పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారా..? అంటే.. అవుననే చెబుతున్నారు జనసేన సైనికులు.. 2024 ఎన్నికలే లక్ష్యంగా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు. ఇప్పటికే.. రెండు విడతల్లో వారాహి యాత్రను నిర్వహించారు. ఇక మూడోసారి వారాహి యాత్ర నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని జనసేన నాయకులు చెబుతున్నారు. అయితే, ఢిల్లీ పర్యటన నాటినుంచి పవన్ కల్యాణ్ వేగం పెంచారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు.. పలువురు కీలక నేతలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత టీడీపీతోపాటు.. పొత్తులపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, బీజేపీ కూడా సంస్థాగతంగా భారీ మార్పులు చేసింది.. బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి నియామకం తర్వాత.. ఆమె కూడా జనసేనతో కలిసే కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పడం.. మరోవైపు పవన్ స్పీడు పెంచడం.. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే రెండుసార్లు నిర్వహించిన పవన్ యాత్రకు పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందని.. ఈసారి అంతకుమించి స్పందన ఉంటుందని జనసేన ప్యాన్స్ చెబుతున్నారు. మొదటిసారి పవన్ కల్యాణ్.. జూన్ 14న కత్తిపూడి నుంచి వారాహి యాత్రను ప్రారంభించారు. ఈ మొదటి విడత యాత్ర అదే నెల 30న భీమవరం సభతో ముగిసింది. ఈ మొదటి యాత్రలో గోదావరి ఉమ్మడి జిల్లాల్లో పది నియోజకవర్గాలను కవర్ చేశారు. ఆ తరువాత రెండో విడత వారాహి విజయ యాత్రను పవన్ కల్యాణ్ జూలై 9 నుంచి ఏలూరులో ప్రారంభించి.. 14వ తేదీన తణుకు సభతో ముగించారు. తాజాగా మూడో విడత వారాహి విజయ యాత్రకు పవన్ కళ్యాణ్ ఫుల్ ప్లాన్ తో సిద్ధమవుతున్నారు. దీనికోసం బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
మొదటిసారి.. కొనసీమ జిల్లాలపై దృష్టిసారించిన జనసేన అధినేత పవన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఆ తర్వాత రాష్ట్రం మొత్తం యాత్ర నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే, మూడో విడత వారాహి యాత్రపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం