Watch Video: ఆసుపత్రిలో కలకలం.. ఉన్నట్టుండి రోగులకు అస్వస్థత.. అసలు కారణం ఇదే..

| Edited By: Srikar T

Jul 10, 2024 | 12:10 PM

అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి ఏరియా అస్పత్రిలో ఇంజక్షన్ వికటించింది. 23మంది ఇన్ పేషెంట్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వణుకు, జ్వరం, వాంతులతో అవస్థలు పడ్డారు. దీంతో హుటాహుటిన వారందరినీ మెరుగైన వైద్య చికిత్స కోసం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. మరొకరికి కేజీహెచ్‎కు తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వైరల్ ఇన్ఫెక్షన్‎లు, జ్వరాలతో వచ్చిన వారికి.. నక్కపల్లి ఏరియా ఆసుపత్రి సిబ్బంది వైద్యం ప్రారంభించారు.

Watch Video: ఆసుపత్రిలో కలకలం.. ఉన్నట్టుండి రోగులకు అస్వస్థత.. అసలు కారణం ఇదే..
Anakapalli Hospital
Follow us on

అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి ఏరియా అస్పత్రిలో ఇంజక్షన్ వికటించింది. 23మంది ఇన్ పేషెంట్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వణుకు, జ్వరం, వాంతులతో అవస్థలు పడ్డారు. దీంతో హుటాహుటిన వారందరినీ మెరుగైన వైద్య చికిత్స కోసం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. మరొకరికి కేజీహెచ్‎కు తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వైరల్ ఇన్ఫెక్షన్‎లు, జ్వరాలతో వచ్చిన వారికి.. నక్కపల్లి ఏరియా ఆసుపత్రి సిబ్బంది వైద్యం ప్రారంభించారు. సెఫోటాక్సిమ్ ఇంజక్షన్ ఇస్తున్నారు. ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికి.. ఒక్కొక్కరుగా అస్వస్థతకు గురయ్యారు. వైరల్ ఇన్ఫక్షన్లతో ఆసుపత్రికి వచ్చిన వారికి ఇంజక్షన్ చేశారు సిబ్బంది. బాధితులు నక్కపల్లి, ఎస్ రాయవరం పరిసర ప్రాంతాలకు చెందిన వారుగా తెలుస్తోంది.

జూలై 9, మంగళవారం రాత్రి నక్కపల్లి ఆసుపత్రిలో ఇంజక్షన్ రియాక్షన్ అయిందని వైద్య ఉన్నతాధికారుల నుంచి అలర్ట్ మెసేజ్ వచ్చిందన్నారు. 10 నిమిషాల్లోనే 23 మంది ఆసుపత్రికి వచ్చారు. వణుకు జ్వరంతో ఉన్నారు. వెంటనే ట్రీట్మెంట్ ప్రారంభించారు వైద్యసిబ్బంది. ప్రస్తుతం అందరూ కోలుకుంటున్నారని తెలిపారు. మరొకరిని కేజీహెచ్‎కు తరలించారని.. ఆ పేషెంట్ ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉందని చెప్పారు. అనకాపల్లి ఆసుపత్రి డ్యూటీ డాక్టర్ కనకదుర్గ. ఇంజక్షన్ రియాక్షన్‎తో అస్వస్థతకు గురైన రోగులు క్రమంగా కోలుకుంటున్నారు. 18 మందిని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. మరో నలుగురు చికిత్స పొందుతున్నారు. ఘటనపై వైద్యాధికారులు విచారణ ప్రారంభించారు. పరిస్థితిని కలెక్టర్ ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..