Baba Ramdev: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి రంగంపేటలో ప్రముఖ యోగ గురువు రామ్ దేవ్ బాబా పర్యటించారు. స్థానిక పామాయిల్ సాగు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఆయిల్ పామ్ ప్లాంటేషన్ నర్సరీ, ఫీల్డ్‌లో 5 లక్షల హెక్టార్ల భూమిలో పతంజలి మిషన్ ఆఫ్ ఆయిల్ పామ్ ప్లాంటేషన్ గురించి రైతులకు వివరించారు. ఏపీలో పామాయిల్ దిగుబడి మరింత పెంచేందుకు కృషి చేస్తామని తెలిపారు. రైతులకు పామాయిల్ సాగుకు అవసరమైన శిక్షణ, సాంకేతిక సహాయం చేస్తామన్నారు రాందేవ్ బాబా.
రంగంపేట మండలం దొంతమూరు పామాయిల్ తోటల్లో పర్యటించిన ఆయన … పెద్దాపురంలో పామాయిల్ రుచి పరిశ్రమకు పతాంజలి పరిశ్రమగా నామకరణం చేశారు. రాష్ట్రంలో లక్ష 50 వేల ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్నారని, కేవలం తూర్పుగోదావరి జిల్లాలోనే 30 శాతం పామాయిల్ సాగుఉందన్నారు. ఈ సాగును మరింత పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రాందేవ్ బాబా చెప్పారు. గంటకి 75 టన్నులు తీస్తున్న పరిశ్రమ 200 టన్నులకు పెంచాలని రైతులకు సూచించారు.
అనపర్తి రంగంపేటలో రాందేవ్ బాబా పర్యటన | AP News – TV9#tv9telugu #apnews #ramdevbaba pic.twitter.com/YnUqjlGV1z
— TV9 Telugu (@TV9Telugu) June 15, 2023
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..