Crime: లేడీ కండక్టర్ చొక్కా చించేసిన ప్రయాణికుడు
ఓ మహిళా కండక్టర్ దుస్తులను ఓ ప్రయాణికుడు చించేశాడు. ఈ దారుణమైన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. కండక్టర్ చొక్కాను చించడమే కాకుండా.. ఆమెపై పిడిగుద్దులు కురిపిస్తూ..

ఓ మహిళా కండక్టర్ దుస్తులను ఓ ప్రయాణికుడు చించేశాడు. ఈ దారుణమైన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. కండక్టర్ చొక్కాను చించడమే కాకుండా.. ఆమెపై పిడిగుద్దులు కురిపిస్తూ తీవ్రంగా దాడి చేశాడు ప్రయాణికుడు. గుర్రంకొండ, తరికొండల సమీపంలో ఈ ఘటన జరిగింది. మదనపల్లెకు చెందిన ఓ ఆర్టీసీ బస్సులో శివారెడ్డి అనే వ్యక్తి బస్సు ఎక్కాడు. ఈ క్రమంలో లేడీ కండెక్టర్ బస్సులోని ప్రయాణికులందరికీ టికెట్లు ఇచ్చింది. కానీ శివారెడ్డి మాత్రం టిక్కెట్టు తీసుకోలేదు. టికెట్ తీసుకోకపోవడంతో కండక్టర్ అతన్ని ప్రశ్నించి.. టికెట్ తీసుకోవాలని చెప్పింది. దీంతో ఇద్దరి మధ్యా వాగ్వాదం చోటుచేసుకుంది. అంతే కోపంతో ఊగిపోయిన శివారెడ్డి లేడీ కండక్టర్‌పై దాడికి దిగాడు.
ఆమె చొక్కా పట్టుకుని చంచేశాడు. దీన్ని గమనించిన తోటి ప్రయాణికులు అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ అతను ఆగలేదు. ఆమెపై పిడిగుద్దులు కురిపించాడు. మహిళ అని కూడా చూడకుండా చేయి చేసుకున్నాడు. చివరికి ప్రయాణికులంతా కలిసి శివారెడ్డిని చితకబాది.. స్థానిక పోలీసులకు అప్పగించారు. కాగా.. లేడీ కండెక్టర్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. కండక్టర్‌పై దాడిపై ఆర్టీసీ కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.