Budameru Floods: బుడమేరు కట్ట మళ్లీ తెగిందంటూ పుకార్ల షికారు.. వదంతులు నమ్మొద్దంటూ మైకుల్లో పోలీసుల ప్రచారం

|

Sep 15, 2024 | 11:16 AM

బెజవాడలో నిన్నమొన్నటి వరకూ హడలెత్తించిన వరద దృశ్యాలు ఇప్పటికీ కళ్లముందే మెదులుతున్నాయి. బుడమేరు తెగడంతో ఒక్కసారి నీటి ప్రవాహం జనసామాన్యం ఇళ్లలోకి ప్రవేశించడంతో జనజీవనం అస్తవ్యస్తంమైంది. ఎట్టకేలకు చంద్రబాబు సర్కార్‌ అఘమేఘాల మీద తెగిన కరకట్టను పునఃనిర్మించడంతో అక్కడ సాధారన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పలు ప్రాంతాల్లోకి మళ్ళీ బుడ మేరు..

బుడమేరు, సెప్టెంబర్ 15: బెజవాడలో నిన్నమొన్నటి వరకూ హడలెత్తించిన వరద దృశ్యాలు ఇప్పటికీ కళ్లముందే మెదులుతున్నాయి. బుడమేరు తెగడంతో ఒక్కసారి నీటి ప్రవాహం జనసామాన్యం ఇళ్లలోకి ప్రవేశించడంతో జనజీవనం అస్తవ్యస్తంమైంది. ఎట్టకేలకు చంద్రబాబు సర్కార్‌ అఘమేఘాల మీద తెగిన కరకట్టను పునఃనిర్మించడంతో అక్కడ సాధారన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పలు ప్రాంతాల్లోకి మళ్ళీ బుడ మేరు వరద వస్తుందని రెండు, మూడు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. బుడమేరుకు మళ్లీ గండి పడిందని, దీంతో బెజవాడకు భారీ వరద ముంపు పొంచి ఉందనేది వాటి సారంశం. దీంతో ఆ ప్రాంతంలోని వారంతా ఇళ్ల నుంచి బయటకొచ్చేశారు.

వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. బుడ మేరు కట్ట మళ్ళీ తెగింది అనేది పూర్తిగా అవాస్తవం అని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దు.. ప్రచారాలు నమ్మవద్దంటూ పోలీసులు మైకులు పట్టుకుని అక్కడి వీధుల్లో ప్రచారం చేయడం ప్రారంభించారు. ఇక ఇప్పటికే మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కూడా ఈ పుకార్లపై స్పందించారు. నగరంలో పలు ప్రాంతాల్లోకి మళ్ళీ బుడ మేరు వరద వస్తుందనేది కేవలం పుకార్లు మాత్రమేనన్నారు. న్యూ ఆర్.ఆర్.పేట, జక్కంపూడి కాలనీ తో పాటు పలు ప్రాంతాల్లోకి వరద వస్తుందని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం అన్నారు. VMC కమిషనర్ ధ్యాన చంద్ర,ENC గోపాల కృష్ణా రెడ్డి తో ఫోన్ లో మాట్లాడి సమాచారం తెలుసుకున్న మంత్రి నారాయణ.. బుడ మేరు కట్ట మళ్ళీ తెగింది అనేది పూర్తిగా అవాస్తవం, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు. విజయవాడ పూర్తిగా సేఫ్‌గా ఉందని, ఆందోళన చెందొద్దని హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.