కన్న కొడుకు చనిపోయాడన్న పుట్టెదు దుఃఖం ఓవైపు వెంటాడుతోన్నా.. గారాబంగా పెంచుకున్న తమ పేగు బంధం చిన్న వయసులోనే తెగిపోయిందన్న బాధ గుండెల్ని పిండేస్తున్నా.. ఆ తల్లిదండ్రులు ఆదర్శవంతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. తమ కొడుకు భౌతికంగా తమ నుంచి దూరమవుతున్నాడని తెలిసి, మరో నలుగురిని బతికించే మహోన్నత నిర్ణయం తీసుకుని పది మందికి ఆదర్శంగా నిలిచారు.
వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళలం జిల్లాకు చెంది కిరణ్ చంద్ అనే పదో తరగతి కుర్రాడు గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ బ్రెయిణ్ డెడ్‌కు గురయ్యాడు కిరణ్ చంద్. ఎంత చేసినా కిరణ్‌ను బతికిలంచలేమని వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో కిరణ్ పేరెంట్స్ గుండె పగిలినంత పనైంది. చిన్న వయసులో కన్న కొడుకు దూరమవుతున్నాడన్న బాధ వాళ్లను కుంగతీసింది.
అయితే తమ కొడుకు ఎలాగో బతకడు కనీసం మరో నలుగురిని బతికించే అవకాశాన్ని వదులుకొవద్దని నిర్ణయించుకున్నారు. గుండె నిండా విషాదంలోనూ ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు. కిరణ్ అవయవ దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఇందుల భాగంగానే జెమ్స్ ఆసుపత్రి నుండి గ్రీన్ ఛానల్ ద్వారా గుండె, లివర్, కిడ్నీలను తరలించారు. విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి తిరుపతికి గుండె, విశాఖకు కిడ్నీ, లివర్ అవయవాలు తరలించారు అధికారులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..