Sajjala fire on Babu: రాష్ట్రంపై దుష్ప్రచారం చేస్తున్నవారిపై దేశ ద్రోహం కేసు పెట్టాలి.. టీడీపీ అధినేత చంద్రబాబుపై సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్

|

May 07, 2021 | 4:40 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త కొవిడ్‌ వేరియంట్‌ ఉందంటూ విపక్షం విష ప్రచారం చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైసీసీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.

Sajjala fire on Babu: రాష్ట్రంపై దుష్ప్రచారం చేస్తున్నవారిపై దేశ ద్రోహం కేసు పెట్టాలి.. టీడీపీ అధినేత చంద్రబాబుపై సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్
Sajjala Ramakrishna Reddy
Follow us on

 Sajjala Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త కొవిడ్‌ వేరియంట్‌ ఉందంటూ విపక్షం విష ప్రచారం చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైసీసీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు దుష్ప్రచారం వల్లే.. తెలుగు రాష్ట్రాలపై ఢిల్లీ, ఒడిశా ప్రభుత్వాలు ఏపీ ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించాయని ఆయన ఆరోపించారు.

ఎన్‌440కే వైరస్‌ కేరళలో చాలాకాలం నుంచి ఉందని పరిశోధకులు తేల్చారని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్‌440కే వైరస్‌ లేదని సీసీఎంబీ చెప్పిందని గుర్తుచేశారు. కరోనా వైరస్ కు సంబంధించి ఏమాత్రం అవగాహన లేకుండా, రాజకీయ అంశంకాని సైన్స్ పరమైన అంశాలను కూడా విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆయన విరుచుకుపడ్డారు. ఎన్‌440కే వైరస్‌ అంత ప్రమాదకరమైంది కాదని పరిశోధనల్లో తేలిందన్నారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. విపత్కరణ పరిస్థితుల్లో విపక్షాలు బురద రాజకీయాలు మాని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

కోవిడ్ సెకండ్ వేవ్ మొదలైంది ఆంధ్రప్రదేశ్ లో కాదన్న సజ్జల. సెకండ్ వేవ్ అనేది పశ్చిమాది రాష్ట్రాల నుంచి వ్యాప్తి చెందిందని దేశం మొత్తం వ్యాపించిందని గుర్తు చేశారు. అటువైపు నుంచి మనకు రావడం వల్లే ఢిల్లీ, మహారాష్ట్రల్లో ఘోరమైన పరిస్థితులు చూశామన్నారు. దీనిని రాజకీయం చేసి, మాట్లాడుకునే సమయం కాదన్న సజ్జల.. ఏపీలో ఎన్ 440కె స్ట్రెయిన్ ప్రభావం ఉందని ఎటువంటి ఆధారాలు లేవని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా స్పష్టం చేశారన్నారు. ఫిబ్రవరిలో ల్యాబ్ కల్చర్ చేసినప్పుడు అలా వచ్చింది, దానిని సీరియస్ గా తీసుకోవడానికి వీల్లేదని చెప్పారు. రాష్ట్రంలో కరోనా బాధితులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పటికే అన్ని ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యలు అందిస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు.

మరోవైపు, కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతుందన్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సీరం కంపెనీ యాజమాన్యంకు ఏప్రిల్ 24న రాష్ట్ర ప్రభుత్వ తరఫున ప్రిన్సిపల్ సెక్రటరీ 4.08 కోట్లు వ్యాక్సిన్ లు కావాలని లేఖ రాశారన్నారు. అలాగే, భారత్ బయోటెక్ యాజమాన్యానికి కూడా ఏప్రిల్ 24వ తేదీన 4 కోట్లు వ్యాక్సిన్ లు కావాలని లేఖ రాస్తే.. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మాత్రమే వ్యాక్సిన్లు సరఫరా చేస్తామని స్పష్టంగా ఆయా యాజమాన్యాలు తిరుగు లేఖలు రాశాయన్నారు. దీన్ని బట్టి వ్యాక్సిన్ల ఉత్పత్తి, డిస్ట్రిబ్యూషన్, మోనిటరింగ్ అన్ని అంశాలు కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉన్నాయి. కేంద్రం అనుమతి లేకుండా వ్యాక్సిన్లు ఇచ్చే పరిస్థితి లేదని సజ్జల గుర్తు చేశారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేత వ్యాక్సిన్ అవసరాల దృష్ట్యా ప్రధానికి లేఖ రాస్తే మంచిదన్నారు.

Read Also…  కొత్తగా వచ్చిన N440K కొవిడ్ వైరస్ అంటే ఏమిటీ..! ఏపీలో ఎక్కువగా వ్యాప్తి..? సీసీఎంబీ ఏం చెబుతోంది..