Operation Parivartan: విశాఖ మన్యంలో గంజాయి తోటలను ధ్వంసం.. అడ్డుతిరిగిన గిరిజనులు.. మరి పోలీసులు ఏం చేశారంటే..

|

Nov 03, 2021 | 4:01 PM

Operation Parivartan: దేశ వ్యాప్తంగా ఎక్కడ గంజాయి, డ్రగ్స్ పట్టుబడినా దానికి మూలం ఏపీ పేరే వినిపిస్తుండటం, విశాఖ ఏజెన్సీ కేంద్రంగా గంజాయి రవాణా విపరీతంగా జరుగుతుండటంతో..

Operation Parivartan: విశాఖ మన్యంలో గంజాయి తోటలను ధ్వంసం.. అడ్డుతిరిగిన గిరిజనులు.. మరి పోలీసులు ఏం చేశారంటే..
Ganja
Follow us on

Operation Parivartan: దేశ వ్యాప్తంగా ఎక్కడ గంజాయి, డ్రగ్స్ పట్టుబడినా దానికి మూలం ఏపీ పేరే వినిపిస్తుండటం, విశాఖ ఏజెన్సీ కేంద్రంగా గంజాయి రవాణా విపరీతంగా జరుగుతుండటంతో.. ఈ వ్యవహారాన్ని ఏపీ సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. గంజాయి సాగు, స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుతవం. గంజాయి కనిపిస్తే చాలు కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే పోలీసులు.. ఆపరేషన్ పరివర్తన్ పేరుతో గంజాయిని ధ్వంసం చేసే కార్యక్రమం చేపట్టారు. విశాఖ ఏజెన్సీలో గంజాయి తోటలను గుర్తించి ధ్వంసం చేస్తున్నారు. గంజాయి తోటల ధ్వంసాన్ని గిరిజనులు వ్యతిరేకిస్తున్నప్పటికీ.. పోలీసులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. బుధవారం నాడు విశాఖపట్నంలోని జి.మాడుగుల మండలం బొయితిలి పరిసర ప్రాంతాల్లో గంజాయి సాగు చేస్తున్నారని సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి వెళ్లారు.

అయితే, గంజాయి తోటలను ధ్వంసం చేస్తున్న అధికారులను గిరిజన మహిళలు అడ్డుకున్నారు. దాంతో అక్కడ భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. స్థానిక గిరిజన మహిళలతో పోలీసు అధికారుల బృందం చర్చలు జరిపారు. గంజాయి పెంపకంతో ఆధారపడి ఉన్న తమకు ఈ ఏడాది గంజాయి సాగుకు అవకాశం ఇవ్వాలని అధికారులను గిరిజనులు వేడుకున్నారు. వచ్చే ఏడాది నుంచి గంజాయి సాగు చెయ్యబోమని హామీ ఇచ్చారు. బంగారం తాకట్టు పెట్టి మరి గంజాయి సాగుపై పెట్టుబడి పెట్టామని, ఈ ఒక్కసారికి వదిలేయాలని కన్నీటిపర్యంతం అయ్యారు గిరిజన మహిళలు. ఒకవేళ ఈ ఏడాది కొట్టేస్తామంటే.. నష్టపరిమారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా, ఒక బృందం అధికారులు గిరిజన మహిళలతో చర్చలు జరుపుతుండగా.. మరో బృందం గంజాయి సాగును ధ్వంసం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Also read:

Bigg Boss 5 Telugu Promo: యాంకర్ రవికి చుక్కలు చూపించిన హౌస్‏మేట్స్.. ఒంటినిండా పేడ పూసి.. పేడ నీళ్లు పోసి..

Viral Video: మానవత్వం అంటే ఇదే.. కుక్క ప్రాణాన్ని కాపాడిన డ్రైవర్.. వీడియో వైరల్..

ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా.. ఈ సమస్యలకు చెక్..