
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ఇప్పుడు రాష్ట్రంలోనే ప్రధాన వ్యాపార కేంద్రంగా పేరు పొందింది. 2025లో పూర్తిగా కొత్త తరహా షాపింగ్ కల్చర్‌ను నమోదు చేసింది. నిత్యవసర కూరగాయల నుంచి ప్రీమియం ఉత్పత్తుల వరకు అన్ని ఆన్లైన్లోనే ఆర్డర్లు చేస్తూ కార్పొరేట్ నగరాలకు దీటుగా నిలుస్తోంది. ఉదయం లేవగానే ఉప్పు , పప్పులతో మొదలై.. రాత్రి పడుకునే లోపు బ్యూటీ ప్రొడక్ట్స్ , ఎలక్ట్రానిక్స్ వరకు అన్ని డోర్ డెలివరీనే ప్రజలు ఎంచుకుంటున్నారు. ఇటీవల దేశంలో ప్రముఖ క్వాక్ కామర్స సంస్థలో ఒకటైన ఇన్ఫ్లో మార్ట్ విడుదల చేసిన నివేదిక ఈ మార్పులు స్పష్టంగా చూపిస్తుంది. గత ఏడాదితో పోలిస్తే విజయవాడలో అనేక కేటగిరీలలో కొనుగోలు ఆశ్చర్యకరంగా పెరిగినట్లు వెల్లడించి.
నివేదిక ప్రకారం చూస్తే.. బ్యాగులు , వాలెట్ల ఆర్డర్లు ఏకంగా 538% పెరిగాయి. క్రీడలు , ఫిట్నెస్ పరికరాలు 495% , బ్యూటీ ప్రొడక్ట్స్ , ఆభరణాల్లో 330% , బొమ్మలలో 240% , ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో 223% వృద్ధి నమోదు అయింది. ఉదయం వేళల్లో ముఖ్యంగా నిత్యవసర సరుకులు ఆర్డర్లు అధికంగా ఉంటున్నాయి. వాటిలో చుక్కకూర మొదటి స్థానంలో ఉండగా.. ఉల్లిపాయలు , టమాటాలు , తర్వాత స్థానాల్లో ఉన్నాయి. బంగాళదుంపలు , సన్ఫ్లవర్ ఆయిల్ వంటి ఉత్పత్తుల డిమాండ్ కూడా గణనీయంగా పెరిగింది. థమ్సు అప్ , లేస్ , బింగో , కురుకురే , పంచదార , బిస్లరీ , విమ్ వంటి బ్రాండ్ల వినియోగదారుల ఎంపికతో ముందంజలో కొనసాగుతున్నాయి..
ఇక ప్రీమియం షాపింగ్ విషయానికి వస్తే.. విజయవాడ నగరానికి చెందిన ఓ వ్యక్తి ఒక్క ఏడాదిలోనే 3.62 లక్షల విలువైన ఉత్పత్తులు కొనుగోలు చేసి టాప్ లో నిలిచారు.. మరో నలుగురు 3 లక్షల పైగా ఖర్చు చేసినట్లు నివేదిక చెప్తుంది. ఇవన్నీ బెజవాడ వాసులు నాణ్యత సౌకర్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు అన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.