AP Online Classes: ఏపీ విద్యార్ధులకు ముఖ్య గమనిక.. జూలై 15 నుంచి ఆన్‌లైన్ క్లాసులు..

ఏపీ విద్యార్ధులకు ముఖ్య గమనిక. జూలై 15వ తేదీ నుంచి ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చిన వీరభద్రుడు..

AP Online Classes: ఏపీ విద్యార్ధులకు ముఖ్య గమనిక.. జూలై 15 నుంచి ఆన్‌లైన్ క్లాసులు..

Updated on: Jul 05, 2021 | 6:21 PM

ఏపీ విద్యార్ధులకు ముఖ్య గమనిక. జూలై 15వ తేదీ నుంచి ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చిన వీరభద్రుడు వెల్లడించారు. ఒకటవ తరగతి నుంచి పదో తరగతి వరకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తామని.. వాటిని దూరదర్శన్, రేడియో, విధ్యవారధి ద్వారా ప్రసారం చేయనున్నట్లు చెప్పుకొచ్చారు. అటు ఫిజికల్ క్లాసుల నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని.. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుందని చినవీరభద్రుడు తెలిపారు.

ఆదివారం కృష్ణాజిల్లాలోని పెడనలో ‘నాడు-నేడు’ కింద అభివృద్ధి చేసిన స్కూల్‌ను పరిశీలించిన ఆయన.. ఈ నెల 1వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలలకు ఉపాధ్యాయులు 50 శాతం హాజరవుతున్నారని చెప్పారు. అలాగే విద్యార్ధుల ప్రవేశాల ప్రక్రియ కూడా కొనసాగుతోందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు తెలిపారు.

కాగా, రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఇంకా తగ్గకపోవడం, విద్యార్ధులు స్కూల్స్‌కు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వం ఆన్‌లైన్ క్లాసుల వైపు మొగ్గు చూపింది. విద్యార్ధులను ఒత్తిడి చేయకుండా 70 శాతం ఫీజులు మాత్రమే వసూలు చేయాలని ఏపీ సర్కార్ విద్యాసంస్థలను ఆదేశించింది. రెగ్యులరిటీ అండ్ మానిటరింగ్ కమిటీ ఈ సంవత్సరం ఫీజులు నిర్ణయిస్తుందని.. కమిటీ నిర్ణయించిన ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తప్పవని జగన్ ప్రభుత్వం హెచ్చరించింది.

Also Read: 

మందుబాబులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో తగ్గనున్న బీర్ల ధరలు.. వివరాలివే.!

మెడలో పాముతో వృద్ధుడు సైకిల్‌పై సవారీ.. వీడియో చూస్తే మీరూ ఔరా అనాల్సిందే!