AP CM Jagan Odisha Tour: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో సీఎం వైఎస్ జగన్‌ భేటీ

ఒడిశా రాష్ట్ర పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌లో సమావేశమయ్యారు.

AP CM Jagan Odisha Tour: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో సీఎం వైఎస్ జగన్‌ భేటీ
Jagan Meets Navin Patnayak

Updated on: Nov 09, 2021 | 8:48 PM

AP CM YS Jagan Odisha Tour: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమావేశమయ్యారు. ప్రత్యేక విమానంలో భువనేశ్వర్ చేరుకున్న సీఎం జగన్.. ఒడిశా సచివాలయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. మూడు అంశాలపై ఒడిశా సీఎంతో సీఎం వైఎస్‌ జగన్‌ చర్చించారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి జాయింట్‌ కమిటీ వేయాలని నిర్ణయించారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులలతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఒడిశా అభ్యంతరాలతో అనేక దశాబ్దాలుగా అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలపై ఈ భేటీలో చర్చించారు. వంశధార నదిపై నేరేడి బ్యారేజీ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం వైఎస్‌ జగన్‌.. ఈ భేటీలో నవీన్ పట్నాయక్‌తో చర్చించారు.పోలవరం ప్రాజెక్ట్‌ ముంపు గ్రామాల సమస్యపై సీఎంలు చర్చించారు. బహుదానది నీటి విడుదలపై కూడా ముఖ్యమంత్రులు చర్చించారు. అలాగే, ఇంధన రంగంలో బలిమెల, ఎగువ సీలేరు కోసం ఎన్‌వోసీ, యూనివర్శిటీల్లో ఒడిశా, తెలుగు భాషాభివృద్ధికి కృషి.. తీవ్రవాదం, గంజాయి నియంత్రణకు రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని నిర్ణయించారు.

ప్రత్యేక విమానంతో భువనేశ్వర్ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలికారు సీఎం నవీన్ పట్నాయక్. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో పాటు వివిధ శాఖ ఉన్నతాధికారలు పాల్గొన్నారు. వంశధార నదిపై నేరేడి బ్యారేజీ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం వైఎస్‌ జగన్‌.. ఈ భేటీలో నవీన్ పట్నాయక్ చర్చించనున్నట్లు సమాచారం. ఈ భేటీతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉత్తరాంధ్ర రైతుల కల సాకారం అవుతుందని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఒడిశా తెలుగు అసోసియేషన్‌ సభ్యులు కలిశారు.

Cm Jagan Meets Odisha Cm Navin Patnayak