Andhra Pradesh: వామ్మో అనిల్ వచ్చిండో.. కాకినాడలో కరుడుగట్టిన దొంగ సంచారం.. భయం గుప్పిట్లో ప్రజలు..

అతను మామూలు దొంగ కాదు.. కరుడుగట్టిన గజదొంగ.. అతను పేరు వింటే చాలు ప్రజలు భయంతో వణికిపోతారు.. తాజాగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. అవుల అనిల్ తూర్పుగోదావరి జిల్లాలో మళ్లీ యాక్టివ్ అయ్యాడు.

Andhra Pradesh: వామ్మో అనిల్ వచ్చిండో.. కాకినాడలో కరుడుగట్టిన దొంగ సంచారం.. భయం గుప్పిట్లో ప్రజలు..
Kakinada

Updated on: Apr 08, 2023 | 1:53 PM

అతను మామూలు దొంగ కాదు.. కరుడుగట్టిన గజదొంగ.. అతను పేరు వింటే చాలు ప్రజలు భయంతో వణికిపోతారు.. తాజాగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. అవుల అనిల్ తూర్పుగోదావరి జిల్లాలో మళ్లీ యాక్టివ్ అయ్యాడు. కాకినాడ ఎల్‌ బీ నగర్‌లో ఓ ఇంటి ముందు అనిల్ రెక్కి నిర్వహించాడు. అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డు అయ్యాయి. పలు కేసుల్లో నిందితుడుగా ఉన్న ఆవుల అనిల్‌ కుమార్‌ మరోసారి ప్రత్యక్షం అవ్వడంతో అప్రమత్తమైన కాకినాడ డీఎస్పీ ప్రజలను అలర్ట్‌ చేశారు.

దొంగ ఆవుల అనిల్ కుమార్ కాకినాడ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు వెల్లడించారు.ఇతడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా్ల్లో పలు కేసుల్లో నిందితుడని క్రైం డీఎస్పీ రాంబాబు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అతడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

ఆవుల అనిల్ కుమార్ కదలికలపై పెద్దాపురం, కాకినాడ సబ్‌డివిజన్లలో గల ఎస్సైలు, పోలీసు సిబ్బందిని అలెర్ట్ చేసినట్లు డీఎస్పీ రాంబాబు వెళ్లడించారు. గ్రామాల్లో విలేజ్‌ కమిటీలు కూడా అప్రమత్తంగా ఉండి మైకుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. నిందితుడు ఆవుల అనిల్‌ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

అతడి కదలికలపై నిఘా పెట్టామని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ రాంబాబు పేర్కొన్నారు. త్వరలోనే అనిల్‌ ను పట్టుకుంటామని.. ఎక్కడైనా తారసపడితే సమాచారం అందించాలని సూచించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..