Chandra Babu: కుప్పంలో చంద్రబాబు ఇంటి నిర్మాణానికి నో అబ్జెక్షన్ .. ఎట్టకేలకు అనుమతులు లభ్యం

| Edited By: Surya Kala

Jul 24, 2023 | 6:35 AM

శాంతిపురం మండలం శివపురం సమీపంలో కుప్పం పలమనేరు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న సుమారు 2 ఎకరాల స్థలాన్ని ఏడాది క్రితం చంద్రబాబు కొనుగోలు చేసి ఆ భూమిని కుప్పం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గత ఏడాది జూలై 22నే రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. ఆ స్థలాన్ని పరిశీలించి ఇంటి నిర్మాణం కోసం ప్లాన్ ను సిద్దం చేసి అప్రూవల్ కోసం అప్లయ్ చేశారు.

Chandra Babu: కుప్పంలో చంద్రబాబు ఇంటి నిర్మాణానికి నో అబ్జెక్షన్ .. ఎట్టకేలకు అనుమతులు లభ్యం
N.chandrababu Naidu
Follow us on

కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి నిర్మాణానికి అడ్డంకులు తొలిగాయి. ఎట్టకేలకు అనుమతులు లభించాయి. దీంతో తిరిగి పనులు ప్రారంభం అయ్యాయి. నిర్మాణానికి అనుమతులు వచ్చాయంటూ పూజలు చేసి పనులు పునః ప్రారంభించాయి టీడీపీ శ్రేణులు. ఏడాది క్రితం ప్రారంభించిన చంద్రబాబు ఇంటి నిర్మాణం ఇప్పటి దాకా ప్రహరీ గోడకే పరిమితం కాగా ఏడాదిగా ఇళ్లు కడుతున్న బాబు గారి ఇంటి వ్యవహరం మాత్రం అధికార ప్రతిపక్షాల మద్య మాటల యుద్ధం తో రాజకీయంగా చర్చగానే నడుస్తూనే ఉంది.

టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్యే గా వరుస విజయాలు సాధిస్తున్న కుప్పంలో ఇళ్ళు కట్టుకోవడం వివాదాస్పదంగా మారిపోయింది. దాదాపు 35 ఏళ్ల తరువాత సొంత నియోజకవర్గంలో తనకంటూ సొంత ఇళ్లు ఉండాలన్న ఆలోచన కార్య రూపం దాల్చడం కష్టంగా మారింది. ఇంటి నిర్మాణానికి ఉపక్రమించిన చంద్రబాబుకు అనుమతి పెద్ద సమసైంది. ఇంటి నిర్మాణం కోసం టీడీపీ ముఖ్య నేతలు దరఖాస్తు చేసి ఏడాది కావస్తున్నా అప్రూవల్ కోసం ఇబ్బంది పడ్డ పరిస్థితి ఇందుకు కారణం కాగా రాజకీయంగా కూడా ఏడాదిగా ఇదో చర్చ గా మారింది. ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం లేదని టీడీపీ నేతలు ఆరోపించడం, ఇంటి నిర్మాణాన్ని కూడా రాజకీయం చేస్తుందని వైసీపీ ఎదురుదాడి చేయడంతో ఈ వ్యవహరం చర్చగా కూడా మారింది. ఒక దశలో న్యాయ పోరాటానికి సిద్ధపడాల్సి వచ్చింది. నెల రోజుల క్రితం 3 రోజుల కుప్పం చంద్రబాబు పర్యటన సమయంలోనూ ఇంటి నిర్మాణ పర్మిషన్ ఇష్యూ సీరియస్ గానే చర్చకు వచ్చింది.

3 దశాబ్దాలుగా చంద్రబాబు కుప్పం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నా సొంత ఇళ్లు లేదంటూ వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టే ప్రయత్నం చేసేందుకు టీడీపీ ఏడాదిగా ప్రయత్నిస్తోంది. కుప్పంలో చంద్రబాబుకు సొంత ఇంటిని ఎంత త్వరగా అంటే అంత త్వరగానే పూర్తి చేసి నోరు మూయించాలని భావించినా సక్సెస్ కాలేకపోయింది. శాంతిపురం మండలం శివపురం సమీపంలో కుప్పం పలమనేరు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న సుమారు 2 ఎకరాల స్థలాన్ని ఏడాది క్రితం చంద్రబాబు కొనుగోలు చేసి ఆ భూమిని కుప్పం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గత ఏడాది జూలై 22నే రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. ఆ స్థలాన్ని పరిశీలించి ఇంటి నిర్మాణం కోసం ప్లాన్ ను సిద్దం చేసి అప్రూవల్ కోసం అప్లయ్ చేశారు. ఈ మేరకు ప్రహరీ గోడ నిర్మాణం తో ఇంటి నిర్మాణ పనులు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

వ్యవసాయ భూమిగా ఉన్న ఆ స్థలంలో భవన నిర్మాణం కోసం ల్యాండ్ కన్వర్షన్ చేయాల్సి రావడంతో పలమనేరు- కుప్పం-మదనపల్లె (పీఎంకే) అర్బన్ డెవలప్మెంట్ అధారిటీకి ముందుగా అన్ని పత్రాలతో అనుమతి కోసం దరఖాస్తు కూడా చేశారు. ఆథారిటీ నుంచి సర్వేయర్ కూడా వచ్చి సర్వే పూర్తి చేయగా భవన నిర్మాణానికి అనుమతి కోసం సంబంధిత పత్రాలను చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ ఉడాకు సమర్పించారు. ఏడాది క్రితమే ఈ తతంగం అంతా జరిగినా ఇంటి నిర్మాణం కోసం అనుమతులు గత నెలలో కుప్పం పర్యటనకు చంద్రబాబు వచ్చినప్పటి దాకా రాలేదు. దీంతో పీకేఎం నుంచి స్పందన లేకపోవడంతో గుంటూరులోని డీటీసీ (డైరెక్టర్ ఆఫ్ కంట్రీ టౌన్ అండ్ ప్లానింగ్) కు కూడా అన్ని రకాల పత్రాలు సమర్పించిన టీడీపీ ఎట్టకేలకు అనుమతులను పొందింది. డీటీసీకి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న తరువాత అనుమతులు రావడంతో టీడీపీ శ్రేణులు పూజలు చేసి పనులు ప్రారంభించాయి. రాయలసీమ తూర్పు పట్టభద్రుల ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తోపాటు కుప్పం టీడీపీ నేతలు చంద్రబాబు ఇంటి నిర్మాణ పనులను పునః ప్రారంభించగా అసలు చంద్రబాబు ఇంటిని కూడా రాజకీయ చేస్తున్నారని ఈ నెలలో చిత్తూరు జిల్లాలో పర్యటించిన సీఎం జగన్ కుప్పంలో పర్యటించిన మంత్రి పెద్దిరెడ్డిలు ఆరోపించడం కొసమెరుపు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..