1. నదీజలాల విషయంలో టీడీపీ నిర్వహించిన సమావేశంపై రియాక్ట్ అయ్యారు మంత్రి శంకర్ నారాయణ. ప్రాంతీయ భావాలను రెచ్చగొట్టేలా తెలుగుదేశం వైఖరి ఉందని ఆరోపించారు. పోరాడి రావాల్సిన జలాలను తెచ్చుకుంటామని స్పష్టం చేశారు మంత్రి.
2. శ్రీవారిని దర్శంచుకోవడానికి తిరుమల వచ్చారు మంచు విష్ణు. విమానాశ్రయంలో విష్ణుకు ఘనస్వాగతం పలికారు అభిమానులు. అనుకున్న పనులన్నీ చేయడానికి బలాన్ని ఇవ్వమని దేవున్ని కోరుకుంటానని చెప్పారు విష్ణు.
3. తూర్పుగోదావరి జిల్లాలోని పలు పర్యాటక ప్రాంతాలు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. మారేడుమిల్లి వాటర్ ఫాల్స్ వద్ద కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఫలితంగా అనేక మంది పర్యాటకులు ప్రమాదాలకు గురవుతున్నారు.
4. రాయలసీమకు నికర జలాలు కేటాయించాలన్నారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. నదుల అనుసంధానం జరగాలని చెప్పారు బాలయ్య. సీమ నీటి ప్రయోజనాల కోసం అవసరమైతే ఢిల్లీలో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
5. లోక్‌సభ స్థానాలపై ఎల్పీ మీటింగ్‌లో స్పందించారు సీఎం కేసీఆర్. కేంద్ర రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌కు మంచి ప్రియార్టీ ఉంటుందని చెప్పారు. లోక్ సభలో టీఆర్‌ఎస్ పార్టీ కీలకం కాబోతుందన్నారు ముఖ్యమంత్రి. స్థానాలు పెరిగేలా దృష్టిపెట్టాలని సూచించారు గులాబీ బాస్.
6. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై టోల్ ఫ్లాజ వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దసరా అనంతరం తిరుగు ప్రయాణంతో రద్దీ ఏర్పడింది. వరంగల్ నుండి హైదరాబాద్ మార్గంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది.
7. బీజేపీ నేత రాంమాధవ్ రాసిన ది హిందుత్వ పరాదిమ్ పుస్తక ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు జస్టిస్ రఘురాం. రాంమాధవ్ హిందుత్వం గురించి మంచి పుస్తకాలు రాస్తారని కితాబిచ్చారు జస్టిస్ రఘురాం.
8. తడిసిన ప్రతి వడ్ల గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు మంత్రి హరీశ్‌రావు. తెలంగాణ ప్రభుత్వం రైతును రాజు చేస్తోందని చెప్పారు మంత్రి. హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి తాను కృషి చేస్తానన్నారు హరీశ్.
9. సంగారెడ్డి జిల్లా జుకల్ శివార్లలో చిరుత సంచరిస్తోందని ప్రచారం జరిగింది. భయబ్రాంతులకు గురైన స్థానికులు, కూలీలు మంటలు పెట్టి కాపలా కాశారు. జుకల్ చేరుకొని చిరుతపులి అడుగులను పరిశీలించారు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కిరణ్.