AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag: అశ్లీల వీడియోలు చూపించి భర్త టార్చర్.. నవ వధువు ఆత్మహత్య..

కోత్తగా పెళ్లయి కోటి ఆశలతో మెట్టినింట అడుగుపెట్టింది ఆ ఇల్లాలు. తన భవిష్యత్‌ గురించి ఎన్నెన్నో కలలు కంది. భర్త, పిల్లలు, అత్త మామలు గురించి ఆమెకు ఎన్నో మంచి ప్లానింగ్స్ ఉన్నాయి. కానీ భర్త టార్చర్ ముందు ఆమె ఆశలు అన్నీ అడియాశలయ్యాయి. మదపిచ్చితో అతడు చేసిన పని.. ఆమె ఉసురు తీసింది.

Vizag: అశ్లీల వీడియోలు చూపించి భర్త టార్చర్.. నవ వధువు ఆత్మహత్య..
Nagendra Babu
Ram Naramaneni
|

Updated on: Feb 14, 2025 | 12:13 PM

Share

విశాఖలో దారుణ ఘటన వెలుగుచూసింది. భర్త టార్చర్ తాళలేక  నవవధువు వసంత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గోపాలపట్నం నందమూరి కాలనీలో చోటుచేసుకుంది. అశ్లీల వీడియోలు చూపించి తీవ్రంగా టార్చర్ చేశాడు భర్త నాగేంద్రబాబు. దీంతో తట్టుకోలేక ఊరివేసుకుంది వసంత. నాగేంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే భర్తే హత్య చేశాడని వసంత కుటుంబం ఆరోపిస్తుంది.  కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

తన భర్త నాగేంద్రబాబు అశ్లీల వీడియోలు చూపిస్తూ టార్చర్‌ చేస్తున్నాడని కుటుంబ సభ్యుల దగ్గర వాపోయింది. కొన్ని రోజులుగా ఈ సమస్యను తమ ముందు చెబుతోందన్నారు కుటుంబ సభ్యులు. గత రాత్రి కూడా ఫోన్‌ చేసిందని.. అయితే రేపు వచ్చి మాట్లాడాతామని చెప్పామన్నారు. ఇంతలోనే వారి కుటుంబ సభ్యులు ఫోన్‌ చేసి ఆమె చనిపోయిందని చెప్పారంటున్నారు.. అయితే ఇది ఆత్మహత్య కాదని.. హత్య అంటూ ఆరోపిస్తున్నారు మృతురాలి బంధువులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి