AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్నమయ్య జిల్లాలో యువతిపై యాసిడ్‌ దాడి! మరో రెండు నెలల్లో పెళ్లి..

అన్నమయ్య జిల్లా గుర్రంకొండ ప్యారంపల్లెకు చెందిన యువతిపై మదనపల్లెలోని అమ్మచెరువు మిట్టకు చెందిన గణేష్‌ ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువతిపై ముందుగా కత్తితో దాడి చేసిన యువకులు ఆ తర్వాత ముఖంపై యాసిడ్‌ పోశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.

అన్నమయ్య జిల్లాలో యువతిపై యాసిడ్‌ దాడి! మరో రెండు నెలల్లో పెళ్లి..
Acid Attack
SN Pasha
|

Updated on: Feb 14, 2025 | 12:19 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై యువకుడు యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో యువతి తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ ప్యారంపల్లెకు చెందిన యువతిపై మదనపల్లెలోని అమ్మచెరువు మిట్టకు చెందిన గణేష్‌ ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణం అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, వచ్చే ఏప్రిల్‌ 29న బాధితురాలికి వివాహనం నిశ్చయించారు. ఇంతలో ఎంత ఘోరం జరిగిదంటూ ఆ యువతి తల్లిదండ్రులు కన్నీరుమూన్నీరుగా విలపిస్తున్నారు. యువతిపై ముందుగా కత్తితో దాడి చేసిన యువకులు ఆ తర్వాత ముఖంపై యాసిడ్‌ పోశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. కాగా, ఈ దాడికి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే దాడికి గల కారణాలను పోలీసులు త్వరలోనే తెలిపే అవకాశం ఉంది.

నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం..

ఈ యాసిడ్ దాడిపై మంత్రి నారా లోకేష్‌ స్పందించారు. యాసిడ్ దాడి ఘటన తనను తీవ్ర ఆందోళనకు గురిచేసిందని తెలిపారు. బాధిత యువతికి వైద్యసాయం అందించి, అండగా నిలుస్తామన్నారు. యాసిడ్ దాడిచేసిన సైకోను కఠినంగా శిక్షిస్తామని కూడా ఈ సందర్భంగా లోకేష్ హామీ ఇచ్చారు. అలాగే భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

వెండిలో అతి తక్కువ పెట్టుబడి.. ఏడాదిలో ఎంత రాబడి వచ్చిందంటే?
వెండిలో అతి తక్కువ పెట్టుబడి.. ఏడాదిలో ఎంత రాబడి వచ్చిందంటే?
ఈసారి కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వాడీవేడిగానే.!
ఈసారి కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వాడీవేడిగానే.!
ఎర్నాకుళం రైలులో అగ్నిప్రమాదం.. AC బోగీలో వ్యక్తి సజీవ దహనం!
ఎర్నాకుళం రైలులో అగ్నిప్రమాదం.. AC బోగీలో వ్యక్తి సజీవ దహనం!
సిప్‌లో రూ.3000 పెట్టుబడి పెడితే 10 ఏళ్లలో ఎంత సంపాదించవచ్చు!
సిప్‌లో రూ.3000 పెట్టుబడి పెడితే 10 ఏళ్లలో ఎంత సంపాదించవచ్చు!
జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం..! నేడే ఏపీ కేబినేట్ సమావేశం..
జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం..! నేడే ఏపీ కేబినేట్ సమావేశం..
ఇంకా రెండు రోజులే ఉన్నాయి..! పని పూర్తి చేయండి
ఇంకా రెండు రోజులే ఉన్నాయి..! పని పూర్తి చేయండి
గంభీర్ సర్జికల్ స్ట్రైక్ తో ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..?
గంభీర్ సర్జికల్ స్ట్రైక్ తో ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..?
పదో తరగతి అర్హతతో BSFలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి అర్హతతో BSFలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు..
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు..
మీ క్రెడిట్‌ కార్డును వాడుకోమని మీ ఫ్రెండ్‌కు ఇస్తున్నారా?
మీ క్రెడిట్‌ కార్డును వాడుకోమని మీ ఫ్రెండ్‌కు ఇస్తున్నారా?