Andhra Pradesh: పొత్తిళ్లలో ఉండాల్సిన బిడ్డ పొదల్లో.. జన్మనిచ్చిన అమ్మ వదిలేస్తే.. మరో మాతృమూర్తి అక్కున చేర్చుకుంది

|

Sep 24, 2022 | 9:38 PM

మానవత్వం మరిచారు. పుట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే బిడ్డను అడవిలో పడేశారు. ఆకలితో ఆబిడ్డ గొంతు ఎండేలా ఏడ్చాడు. వింటేనే మనసు తరుక్కుపోతూ.. కంట కన్నీరు పెట్టిస్తున్న ఈ అమానవీయ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో జరిగింది.

Andhra Pradesh: పొత్తిళ్లలో ఉండాల్సిన బిడ్డ పొదల్లో.. జన్మనిచ్చిన అమ్మ వదిలేస్తే.. మరో మాతృమూర్తి అక్కున చేర్చుకుంది
kidnap
Follow us on

Andhra Pradesh: ఎన్టీఆర్ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. తల్లి పొత్తిళ్లో హాయిగా నిద్రించాల్సిన ముక్కుపచ్చలారని బిడ్డను ముళ్ల పొదల మాటున పడేశారు. పుట్టిన కొన్ని గంటల పాటునే అడవిలో విసిరేసి వెళ్లారు. అనాధలా కేకలు వేస్తున్న బిడ్డను ఓ మాతృమూర్తి గమనించింది.. ముళ్ల పొదలను దాటుకుంటూ బిడ్డను కాపాడింది. తన చల్లని ఒడిలోకి తీసుకొని ఎండిన గొంతుకు పాలు పట్టించింది. ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రధమ చికిత్స చేయించింది. తర్వాత పోలీసులకు అప్పజెప్పింది. ఈఘటన జిల్లాలోని నూజివీడు మండలం ఆగిరిపల్లి కొండగట్టు ప్రాంతంలో చోటుచేసుకుంది.

బాబును వెంటనే మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ పిల్లల ఆస్పత్రిలో జాయిన్ చేశారు పోలీసులు. వైద్య సేవల తర్వాత బిడ్డను విజయవాడలోని చైల్డ్ కేర్‌కు అందజేశారు. వివరాలు తెలిసిన వాళ్లు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలని సూచించారు పోలీసులు. కేసు నమోదు చేసుకొని చిన్నారిని పడేసిన అడవి ప్రాంతాన్ని పరిశీలించారు ఆగిరిపల్లి ఎస్సై నంబూరి చంటిబాబు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించే పనిలో పడ్డారు. బిడ్డను అడవిలో వదిలేసిన వారిపై చర్యలు చేపట్టారు. అయితే ఈఘటనపై పలువురు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మానవత్వ మరిచిన కొందరి చేష్టలు మానవ సమాజం తలదించుకునేలా చేస్తుందంటూ మండిపడ్డారు. తొమ్మిది నెలలు మోసి.. ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి బిడ్డకు జన్మనిచ్చి ఆతల్లి నుంచి బిడ్డను వేరుచేయడంపై ఆగ్రహం వక్తంచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి