Anantapur: కానిస్టేబుల్ ప్రకాష్, లక్ష్మిల వ్యవహారంలో సరికొత్త ట్విస్ట్.. రంగంలోకి లక్ష్మి భర్త.. ఇరువురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు ప్రయత్నాలు
అనంతపురం అశోక్ నగర్ లో గోపాల్ రెడ్డి హై డ్రామా క్రియేట్ చేశాడు. గత కొంతకాలంగా తనకు దూరంగా ఉంటున్న లక్ష్మీ ఇంటికి వెళ్లి ఘర్షణ పడ్డాడు. అప్పటికే భర్త మీద కోపంతో ఉన్న భార్య లక్ష్మి లైట్స్ ఆఫ్ చేసి కళ్ళల్లో కారం కొట్టి గోపాల్ రెడ్డి పై తిరగబడింది.
Anantapur: అనంతపురం జిల్లా ఎస్పీ, డిఎస్పీలపై ఫిర్యాదు చేసి రాష్ట్రంలో సంచలనంగా మారిన డిస్మిస్ ఏ ఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ వ్యవహారంలో మరో ట్విస్ట్ నెలకొంది. తన భార్య లక్ష్మి ని కానిస్టేబుల్ ప్రకాష్ మాయమాటలతో ట్రాప్ చేశారని ఆరోపిస్తూ భర్త గోపాల్ రెడ్డి రోడ్డు ఎక్కాడు. అంతేకాదు రెడ్ హ్యాండెడ్ గా తన భార్య లక్ష్మి కానిస్టేబుల్ ప్రకాష్ ను పట్టించడానికి అనంతపురం అశోక్ నగర్ లో గోపాల్ రెడ్డి హై డ్రామా క్రియేట్ చేశాడు. గత కొంతకాలంగా తనకు దూరంగా ఉంటున్న లక్ష్మీ ఇంటికి వెళ్లి ఘర్షణ పడ్డాడు. అప్పటికే భర్త మీద కోపంతో ఉన్న భార్య లక్ష్మి లైట్స్ ఆఫ్ చేసి కళ్ళల్లో కారం కొట్టి గోపాల్ రెడ్డి పై తిరగబడింది. ఈ వివాదం పై స్థానికులు 100 కు కాల్ చేయడంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని విచారించారు. అయితే అక్కడ పోలీస్ కానిస్టేబుల్ ప్రకాష్ లేడని పోలీసులు గుర్తించారు. అయితే.. సమీపంలో పార్క్ చేసిన ఉన్న పోలీస్ సింబల్ ఉన్న స్కూటర్ను గుర్తించారు.
భర్త గోపాల్ రెడ్డికి భార్య లక్ష్మీదేవికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చోటు చేసుకుంది. ఘర్షణ వాతావరణాన్ని సద్దుమణిచి పోలీసులు అక్కడి నుంచి అందరిని తరిమేశారు. ఏదైనా ఉంటే ఉదయం వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించి పోలీసులు అక్కడి నుంచి గోపాల్ రెడ్డిని తీసుకెళ్లారు.
గతంలో ఏ ఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ 30 తులాల బంగారం పది లక్షల రూపాయల నగదు చీటింగ్ చేసి తీసుకున్నారని లక్ష్మి పోలీసులకు స్పందనలో ఫిర్యాదు చేశారు. తాజాగా ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ కు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదని లక్ష్మి మీడియా ముందు మాట్లాడారు. ఈ వ్యవహారం ఇలా సాగుతుంటే.. మరోవైపు లక్ష్మి భర్త గోపాల్ రెడ్డి కానిస్టేబుల్ ప్రకాష్ తన భార్యను మాయ మాటలతో ట్రాప్ చేసి ఇదంతా నడిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
Reporter: Kanth, TV9 Telugu
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..